తనలో దాగి ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిశా పటాని..!

April 13, 2021 2:37 PM

సాధారణంగా సినిమా సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన విషయాలను అభిమానులకు తెలియజేస్తుంటారు. ఈ క్రమంలోనే మరికొందరు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు ఉంటారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దిశాపటాని కూడా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు.

సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలు చెప్పారు. తెలుగులో “లోఫర్” సినిమా ద్వారా పరిచయమైన దిశ తర్వాత ఉత్తరాది సినిమాలు ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందులో భాగంగానే ఓ అభిమాని మిమ్మల్ని ప్రత్యేకంగా చూపించేది ఏది? అని అడగగా అందుకు దిశా పటాని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘తన కంటి కింద ఉండే పుట్టుమచ్చ’ అని తెలియజేసింది.

దిశా పటాని ఈ విధంగా చెప్పడమే కాకుండా తన కన్ను కొంత జూమ్ చేసి మరి చూపించింది. ఈ విధంగా ఓ అభిమాని అడిగిన వెంటనే ఎంత స్పోర్టివ్ గా సమాధానం చెప్పడం భలే బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దిశాపటాని ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రంతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment