Bigg Boss 5 Telugu : త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ బిగ్‌బాస్ సీజన్ 5.. కంటెస్టెంట్స్ వీరే ?

July 19, 2021 2:24 PM

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ షో.. దీని గురించి ఎవ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అనేక భాష‌ల్లో ఈ షో చాలా స‌క్సెస్ అయింది. తెలుగులోనూ బిగ్ బాస్ షోను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇక త్వ‌ర‌లోనే ఈ షోకు చెందిన ఇంకో సీజ‌న్‌కు రెడీ అవుతున్నారు. అయితే సీజ‌న్ 5ను వినూత్నంగా నిర్వ‌హించాల‌ని స్టార్ మా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

Bigg Boss 5 Telugu these may be the contestants

ఈ సీజన్‌ సరికొత్తగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిసింది. త్వరలోనే ఈ సీజన్‌ ప్రారంభం కానుండ‌గా అందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ప్ర‌కారం ఈ సారి బిగ్ బాస్ షోలో యాంకర్‌ వర్షిణి , యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటలు పాల్గొంటాయ‌ని తెలుస్తోంది.

అయితే నిర్వాహ‌కులు మాత్రం ఇంకా ఎలాంటి ప్ర‌క‌టనా చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వైర‌ల్ అయ్యే పేర్ల‌లో చివ‌రి వ‌ర‌కు కొన్ని అయినా ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment