త‌న రెండో పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సుమంత్‌.. అస‌లు విష‌యం అదే..!

July 29, 2021 10:34 PM

హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌విత్ర అనే ఆమెను వివాహం చేసుకుంటున్నాడ‌ని ఓ పెళ్లి ప‌త్రిక కూడా వైర‌ల్ అయింది. కానీ అందులో పేర్లు త‌ప్ప వివ‌రాలు ఏమీ లేవు. ఓ ద‌శ‌లో దీనిపై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా స్పందించారు. మొదటి పెళ్లే పెటాకులు అయింది, రెండో పెళ్లి ఎందుకు అని బ‌హిరంగంగానే కామెంట్ చేశారు. అయితే త‌న రెండో పెళ్లిపై సుమంత్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేర‌కు సుమంత్ ఓ వీడియోలో మాట్లాడారు.

actor sumanth given clarity on his 2nd marriage

తాను రెండో పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని, అదంతా వ‌ట్టి పుకారేన‌ని సుమంత్ అన్నారు. ఆ శుభ‌లేఖ నిజ‌మే కానీ.. అది త‌న పెళ్లికి సంబంధించిన‌ది కాద‌ని, సినిమాకు సంబంధించింద‌ని అన్నారు. అందువ‌ల్ల ఈ విష‌యంలో ఇక‌పై పుకార్లు సృష్టించ‌వ‌ద్ద‌ని కోరాడు.

కాగా సుమంత్ 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. త‌రువాత విడాకులు తీసుకున్నారు. దీంతో అప్ప‌టి నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. సినీ కెరీర్ విష‌యంలోనూ సుమంత్ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయాడు. కానీ ఈ మ‌ధ్య నుంచే మ‌ళ్లీ మూవీల్లో నిల‌దొక్కుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment