హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ప్రత్యేకతలు ఇవే!

August 22, 2021 11:07 AM

ప్రస్తుత కాలంలో రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాల పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరిగిపోతోంది. కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు తమ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లను పెద్ద ఎత్తున మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్స్ త్వరలోనే మన దేశంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే హోండా చైనాలో హోండా యు-గో స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ 2 ప్రత్యేకతలతో మనకు అందుబాటులో ఉంది.

ఇది 1.8 కేడబ్ల్యూ గరిష్ట అవుట్ పుట్ గల 1.2 కేడబ్ల్యూ మోటార్ సహాయంతో పనిచేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారుగా 65 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గంటకు 53 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే  చైనాలో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ.86,000 ఉండగా ఇంతకన్నా తక్కువ ధరలోనే హోండా యు-గో మన దగ్గర మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతో  ఈ  స్కూటర్ కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ప్రత్యేకతలు ఇవే!”

Leave a Comment