సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. మొద‌టి మ్యాచ్‌లో త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయి పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, రెండో మ్యాచ్‌లో 200కు పైగా భారీ స్కోరునే సాధించింది.

April 4, 2026 8:07 PM
Sunil Gavaskar giving advice to Chennai Super Kings in IPL 2026.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములపై విశ్లేషణ చేస్తున్న సునీల్ గవాస్కర్. Photo Credit: BCCI/AFP/X.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. మొద‌టి మ్యాచ్‌లో త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయి పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, రెండో మ్యాచ్‌లో 200కు పైగా భారీ స్కోరునే సాధించింది. అయిన‌ప్ప‌టికీ బౌల‌ర్లు విఫ‌లం కావ‌డంతో స్కోరును డిఫెండ్ చేయ‌లేక ఓడిపోయింది. అయితే వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌తం అవుతున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు మాజీ ప్లేయ‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ స‌ల‌హా ఇచ్చారు. చెన్నై జ‌ట్టుకు ప్ర‌ధాన స‌మ‌స్య బౌలింగేన‌ని అన్నారు. టోర్న‌మెంట్‌లో ఇప్ప‌టికి చెన్నై రెండు మ్యాచ్‌ల‌నే ఆడింద‌ని, ఇప్ప‌టికే ఏమీ అయిపోలేద‌ని, ఇక‌పై పుంజుకోవాలంటే క‌చ్చితంగా బౌలింగ్‌ను స‌రిచేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎస్కే త‌మ రెండు మ్యాచ్‌ల‌లోనూ ఓడింద‌ని, అయితే బౌలింగ్ విభాగం చాలా బ‌ల‌హీనంగా ఉంద‌న్నారు. దీని వ‌ల్ల వారు ఎంత భారీ స్కోరు చేసినా ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు అల‌వోక‌గా ఛేదించే అవ‌కాశాలు ఉంటాయ‌న్నారు.

చెన్నై తమ బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాలి..

చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌స్తుతం ఉన్న పేల‌వ‌మైన బౌలింగ్‌తో ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు 220 నుంచి 230 వ‌ర‌కు స్కోర్ చేసినా ఉప‌యోగం ఉండ‌ద‌ని సునీల్ గవాస్క‌ర్ అన్నారు. ఇప్ప‌టికే జ‌ట్ల‌లో బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంద‌ని, అయితే ఏ జ‌ట్టుకైనా బౌలింగ్ చాలా కీల‌క‌మ‌ని అన్నారు. చెన్నై తమ బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంద‌ని ఆయన అన్నారు. ఆయుష్ మాత్రేకు నంబర్ 3 స్థానం అనుకూలంగా ఉంటుంద‌ని, అతను అండర్-19 స్థాయిలో తక్కువ స్థానాల్లో బ్యాటింగ్ చేసినా, మూడో స్థానంలో అతనికి మంచి అవకాశాలు ఉంటాయ‌ని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మొద‌టి మ్యాచ్‌లో తొలి బంతికే ఔట్ అయినప్పటికీ ఆ ప్రభావం అతనిపై కనిపించలేద‌ని, అదే జెన్ నెక్ట్స్‌ ఆలోచనా విధానం ప్రత్యేకత అని అన్నారు. వారు గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుతంపై దృష్టి పెడతార‌ని, ఇది అద్భుతమైన ధోరణి అని ఆయన చెప్పారు.

రోహిత్ చాలా శ్ర‌మిస్తాడు..

ఇక రోహిత్ శ‌ర్మ ఫిట్‌నెస్‌లో వచ్చిన మార్పును కూడా గవాస్కర్ ప్రశంసించారు. రోహిత్ శర్మ శారీరక పరిస్థితిలో వచ్చిన మార్పు అందరికీ స్పష్టంగా కనిపిస్తోంద‌ని, అతను కష్టపడి పనిచేశాడ‌ని, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయ‌ని అన్నారు. అతని ఫుట్‌వర్క్ వేగంగా ఉంద‌ని, అతనికి ఎక్కువ ఎనర్జీ ఉంద‌ని, దాంతో క్రీజ్ వద్ద ఎక్కువ సమయం ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఎలిగెంట్ ప్లేయర్లు బ్యాటింగ్‌ను చాలా సులభంగా కనిపించేలా చేస్తార‌ని, కానీ దాని వెనుక కఠిన శ్రమ ఉంటుంద‌న్నారు. ఇటీవల అతను ఆడిన కొన్ని షాట్లు అతని యువకుడైన రోజుల్ని గుర్తు చేశాయ‌ని అన్నారు. మళ్లీ అతను పరుగులు చేయడం చూడటం చాలా ఆనందంగా ఉంద‌ని, ఎందుకంటే అతను చూడటానికి ఎంతో అందమైన ఆటగాడ‌ని గవాస్కర్ పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment