‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అయితే ఈ మూవీ గురించి త‌ర‌చూ త‌న సోష‌ల్ ఖాతాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.

March 26, 2026 3:43 PM
Ram Gopal Varma's reaction to Dhurandhar 2 movie success and box office records.
‘ధురంధర్ 2’ ప్రభంజనంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. Photo Credit: Ram Gopal Varma/Ranveer Singh/Instagram.

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అయితే ఈ మూవీ గురించి త‌ర‌చూ త‌న సోష‌ల్ ఖాతాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా ఈ మూవీ గురించి పెట్టిన ఓ పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ధురంధ‌ర్ 2 సినిమా అనేక రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డంతో ఇప్పుడు ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు త‌మ చిత్రాల రికార్డులు ఇక ధురంధ‌ర్ 2ను అధిగ‌మించాల‌ని కోరుకుంటార‌ని, అందుకు అవ‌స‌రం అయితే తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని, వైష్ణోదేవిని ద‌ర్శించుకుని పూజ‌లు చేస్తార‌ని అన్నారు. ధురంధ‌ర్ 2 సినిమా ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌పై కూడా ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

రికార్డుల కోసం దేవుళ్ల‌ను ప్రార్థిస్తారు: వ‌ర్మ

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్ప‌టిక‌ప్పుడు స్ప‌ష్ట‌మైన అభిప్రాయాల‌ను చెబుతూ సినిమా ప్ర‌పంచంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ల‌కు తెర తీస్తుంటారు. ధురంధ‌ర్ 2 సినిమా ఘ‌న విజ‌యం సాధించిన అనంతం ఆయ‌న త‌న సోష‌ల్ ఖాతాల్లో వ‌రుస పోస్టులు పెడుతూ ఈ సినిమాకు మ‌రింత హైప్ తీసుకొస్తున్నారు. ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ధురంధ‌ర్ 2 స‌క్సెస్‌ను స‌వాల్‌గా తీసుకుంటార‌ని అంచ‌నా వేశారు. బ‌య‌ట‌కు ఎవ‌రూ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌కపోయినా లోలోప‌ల అది ఉంటుంద‌ని అన్నారు. ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ వారు త‌మ టాక్సిక్ సినిమా ధురంధ‌ర్ 2 రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని దేవుళ్ల‌ను ప్రార్థిస్తార‌ని అన్నారు.

ఆదిత్య ధ‌ర్ త‌న విశ్వాసాల‌పై భ‌రోసా ఉంచారు..

ఇక ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌ను సైతం ఆర్‌జీవీ మెచ్చుకున్నారు. కొంద‌రు దీన్ని ప్రాప‌గాండా మూవీగా అభివ‌ర్ణిస్తున్నార‌ని, కానీ ప్ర‌తి ఒక్క‌రికి ఒక అంశంపై భిన్న ర‌కాల అభిప్రాయాలు ఉంటాయ‌ని, అలాగే ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌కు కూడా అభిప్రాయాలు ఉంటాయ‌ని, దాని ప్ర‌కార‌మే ఆ సినిమా తీశార‌ని అన్నారు. ఏ ఇద్ద‌రూ ఒక అంశంపై ఏకీభ‌వించాల‌నే నియ‌మం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక అంశాన్ని ఒక ద‌ర్శ‌కుడు ఒక విధంగా సినిమాగా తీస్తే, ఇంకో ద‌ర్శ‌కుడు మ‌రో విధంగా తీస్తాడ‌ని, ఆదిత్య ధ‌ర్ త‌న విశ్వాసాల‌పై భ‌రోసా ఉంచి సినిమా తీశార‌ని, ఆయ‌న‌కు త‌న ప‌రిశోధ‌న ఉంద‌ని, త‌న వ‌న‌రులు త‌న‌కు ఉన్నాయ‌ని, వాటిని బ‌ట్టే సినిమా తీశార‌ని, అవి ఒక వ్య‌క్తికి, మ‌రొక వ్య‌క్తికి మారుతాయ‌ని ఆర్‌జీవీ పేర్కొన్నారు.

ధురంధ‌ర్ 2 క‌థ ఏంటంటే..

ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ సామ‌ర్థ్యం క‌లిగిన వ్య‌క్తి అని, ఒక ద‌ర్శ‌కుడికి సామ‌ర్థ్యం ఉంటే ప్రేక్ష‌కులకు తాను న‌మ్మింది చూపిస్తాడ‌ని వ‌ర్మ కితాబిచ్చారు. ఎవ‌రికైనా ఈ సినిమా త‌ప్పు అనిపిస్తే వారికి సినిమా తీసేందుకు ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని సెటైర్ వేశారు. ఇక ధురంధ‌ర్ 2 క‌థ విష‌యానికి వ‌స్తే ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ హ‌మ్‌జా అలీ మ‌జారి అనే పాత్ర‌లో యాక్ట్ చేయ‌గా, ఆ పాత్ర ఎదుగుద‌ల‌ను ఇందులో చూపించారు. అత‌ను షేర్‌-ఎ-బ‌లోచ్‌గా, లియారీ ప్రాంతంలో అప‌రాజిత నాయ‌కుడిగా ఎలా ఎదిగాడో ఇందులో చూపించారు. జ‌స్కిర‌త్ సింగ్ రంగీగా మొద‌లైన అత‌ని ప్ర‌యాణం, దేశంలో జ‌రిగిన ఉగ్ర‌దాడుల‌కు ప్ర‌తీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌లోకి గూఢ‌చారిగా ప్ర‌వేశించే వ‌ర‌కు సాగుతుంది. స్పై-యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీలో ర‌ణ‌వీర్ సింగ్‌తోపాటు అర్జున్ రామ్‌పాల్‌, ఆర్‌.మాధ‌వ‌న్‌, సంజ‌య్ ద‌త్, రాకేష్ బేడీ, డానిష్ పండోర్‌, సారా అర్జున్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment