అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో విలాసవంతమైన కానుకతో తన తల్లి నిర్మల అల్లును సర్‌ప్రైజ్ చేశారు.

March 9, 2026 7:31 PM
Allu Arjun gifting a luxury Lexus car to his mother Nirmala on Women's Day.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తల్లికి లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చిన ఐకాన్ స్టార్. Photo Credit: Allu Arjun/X.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో విలాసవంతమైన కానుకతో తన తల్లి నిర్మల అల్లును సర్‌ప్రైజ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు కొత్త లెక్సస్ లగ్జరీ కారును బహుమతిగా అందజేశారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే నటుల్లో ఒకరైన అల్లు అర్జున్ తన సినిమాలతో పాటు కుటుంబానికి ఇచ్చే విలాసవంతమైన కానుకలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి ప్రాజెక్టుల ద్వారా భారీ పారితోషికం పొందుతున్న ఆయన మల్టీప్లెక్స్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కుటుంబానికి కూడా ఆయ‌న అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తూ వారికి ఖ‌రీదైన వాహ‌నాల‌ను బ‌హుమ‌తిగా అందిస్తున్నారు.

భావోద్వేగానికి గురైన నిర్మ‌ల‌..

ఇక త‌న త‌ల్లి నిర్మ‌ల‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ తన తల్లితో కలిసి కార్ ముందు నిలబడి ఫోటోలు దిగారు. బహుమతిని స్వీకరిస్తున్న సమయంలో నిర్మల అల్లూ భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. అయితే అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కుటుంబానికి మాత్రం క‌చ్చితంగా స‌మ‌యం కేటాయిస్తుంటారు. త‌న సినిమాల షూటింగ్‌లో కాస్త ఖాళీ దొరికినా కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి ఆయ‌న విహార యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. అలాగే సినిమా విడుద‌ల‌య్యాక కూడా ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు టూర్లు వేస్తుంటారు. ఆయ‌న చివ‌రి సారిగా పుష్ప 2 లో యాక్ట్ చేయ‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది.

ఇక సినిమా రంగంలో అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ విజువల్ స్పెక్టకిల్ చిత్రంలో నటిస్తున్నారు. అదనంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రకటించారు. పుష్ఫ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన ఆయ‌న త‌న త‌దుప‌రి చిత్రాల‌తో కూడా స‌త్తా చాటుతార‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment