విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

విశ్వ‌క్ సేన్‌, క‌యాదు లోహ‌ర్ హీరో హీరోయిన్లుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. మార్చి 13, 2026 నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ సినిమా గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో 13వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది.

March 8, 2026 3:39 PM
Vishwak Sen's Funky movie streaming on Netflix.
మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న విశ్వక్ సేన్ ‘ఫంకీ’. Photo Credit: Funky Movie Team/X.

విశ్వ‌క్ సేన్‌, క‌యాదు లోహ‌ర్ హీరో హీరోయిన్లుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. మార్చి 13, 2026 నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ సినిమా గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో 13వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. చిత్రం థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన స‌రిగ్గా నెల రోజుల‌కు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫంకీ చిత్రానికి కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఇందులో న‌రేష్, వీటీవీ గ‌ణేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో ప‌లువురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు సైతం అతిథి పాత్ర‌ల్లో యాక్ట్ చేసి మెప్పించారు. ఇక ఈ చిత్ర క‌థ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

క‌థ ఏంటంటే..

కోమ‌ల్ (విశ్వక్ సేన్‌) సినిమా రంగానికి కొత్త‌. ఏదైనా ఒక సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి విజ‌యం సాధించాల‌ని చూస్తుంటాడు. మంచి ప్రొడ‌క్ష‌న్స్ అనే నిర్మాణ సంస్థ‌లో కోమ‌ల్ కు అవ‌కాశం వ‌స్తుంది. దీంతో రూ.4 కోట్ల‌లోనే సినిమా పూర్తి చేస్తాన‌ని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఫంకీ అనే సినిమాను ప్రారంభిస్తాడు. అయితే రాను రాను ఆ సినిమా బ‌డ్జెట్ రూ.40 కోట్ల‌కు చేరుతుంది. చాలా కాలం అవుతుంది. అయినా సినిమా పూర్తి కాదు, దీంతో మంచి ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాత (న‌రేష్‌) ఒత్తిడికి గురై హాస్పిట‌ల్‌లో చేర‌తాడు. అయితే ఆ విష‌యం తెలుసుకున్న నిర్మాత కుమార్తె చిత్ర (క‌యాదు లోహ‌ర్‌) ఆ సినిమా బాధ్య‌త‌ను నెత్తిన వేసుకుంటుంది. బ‌డ్జెట్ పెర‌గ‌కుండా ద‌ర్శ‌కుడితో మూవీ పూర్తి చేస్తాన‌ని ఆమె ఎంట్రీ ఇస్తుంది. అయితే చిత్ర ఆ బ‌డ్జెట్‌లోనే కోమ‌ల్‌తో సినిమాను పూర్తి చేసిందా.. అస‌లు చివ‌ర‌కు ఏం జ‌రిగింది.. అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

ఇందులో ఈశ్వ‌రీరావు, సంప‌త్ రాజ్‌, దిల్ రాజు, హ‌రీష్ శంక‌ర్‌, అనుదీప్ కేవీ, క‌ల్యాణ్ శంక‌ర్ న‌టించారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టెయిన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా తెర‌కెక్కించారు. సురేష్ సారంగం సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌గా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment