విద్యార్థులకు విజయ్ ఆల్ ది బెస్ట్.. విడాకుల పిటిషన్‌పై మాత్రం మౌనం!

విద్యార్థులంతా భ‌యం, ఆందోళ‌న లేకుండా ప‌రీక్ష‌లు రాయాల‌ని త‌మిళ న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు. త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశించి ఆ పోస్టు పెట్టారు.

March 3, 2026 5:21 PM
Actor Vijay wishing students for exams on X.
పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ధైర్యం చెప్పిన తమిళ నటుడు విజయ్. Photo Credit: TVK Vijay/X.

విద్యార్థులంతా భ‌యం, ఆందోళ‌న లేకుండా ప‌రీక్ష‌లు రాయాల‌ని త‌మిళ న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు. త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశించి ఆ పోస్టు పెట్టారు. త‌న ప్రియ‌మైన త‌మ్ముళ్లు, చెల్లెమ్మ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు చెబుతున్నాన‌ని అన్నారు. భ‌విష్య‌త్ స‌మాజాన్ని నిర్మించ‌బోయే విద్యార్థులు అంద‌రూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ధైర్యంగా ప‌రీక్ష‌లను ఎదుర్కొనాల‌ని అన్నారు. ఉన్న‌త విద్య‌లో ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చాల‌ని, అంతా మంచే జ‌రుగుతుంద‌ని, విద్యార్థులు త‌ప్ప‌క విజ‌యం సాధిస్తార‌ని అన్నారు. అయితే ఆయ‌న భార్య సంగీత ఇటీవ‌ల చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లా కోర్టులో ఆయ‌న నుంచి విడాకులు కావాల‌ని కోరుతూ పిటిష‌న్ వేసిన నేప‌థ్యంలో ఆ విష‌యంపై మాత్రం విజ‌య్ స్పందించ‌లేదు.

విజ‌య్ నుంచి రాని ప్ర‌క‌ట‌న‌..

త‌న భ‌ర్త‌, న‌టుడు విజ‌య్ ఓ హీరోయిన్‌తో వివాహేత‌ర సంబంధాన్ని క‌లిగి ఉన్నాడ‌ని, త‌న‌ను హింస‌కు గురి చేస్తున్నాడ‌ని ఆరోపిస్తూ సంగీత ఇటీవ‌ల‌ కోర్టులో విడాకుల కోసం పిటిష‌న్‌ను దాఖ‌లు చేయ‌గా ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఇరు ప‌క్షాల నుంచి ఆ త‌రువాత ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ విజ‌య్ రాజ‌కీయాల్లో ఉన్నారు క‌నుక ఈ విష‌యంపై క‌చ్చితంగా స్పందిస్తార‌ని అంద‌రూ ఎదురు చూశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆ సంఘ‌ట‌న అనంతరం విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్ చేశారు త‌ప్ప విడాకుల ప్ర‌సక్తి ఎత్త‌లేదు. దీంతో మ‌ళ్లీ అంద‌రిలోనూ ఉత్కంఠ మొద‌లైంది.

2021లో అలా జ‌రిగింది..

విజ‌య్ భార్య సంగీత ఇటీవ‌ల త‌మ వివాహ బంధాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పీటీఐ వార్తా సంస్థ ప్ర‌కారం 2021 ఏప్రిల్‌లో విజ‌య్ ఓ న‌టితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడ‌ని తాను తెలుసుకున్నాన‌ని ఆమె పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ విష‌యం త‌న‌ను తీవ్ర‌మైన భావోద్వేగానికి గురి చేసింద‌ని, దీంతో మాన‌సిక ఎంతో ఆవేద‌న చెందాన‌ని ఆమె వివ‌రించారు. వైవాహిక న‌మ్మ‌కంపై విజ‌య్ చేసింది ద్రోహ‌మేన‌ని, ఆయ‌న వివాహ నియ‌మాల‌ను ఉల్లంఘించార‌ని ఆమె పేర్కొన్నారు. ఇక‌పై రిపేర్ చేయ‌లేనంత‌గా త‌మ వివాహ బంధం ముక్క‌లైంద‌ని ఆమె పిటిష‌న్‌లో తెలిపారు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ నుంచి త‌నకు శాశ్వ‌త పోష‌ణ నిమిత్తం భ‌ర‌ణం ల‌భించేలా చూడాల‌ని ఆమె కోరారు. అలాగే కేసు ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు నీలాంక‌రైలోని త‌మ దాంప‌త్య గృహంలో నివాసం ఉండే హ‌క్కు క‌ల్పించాల‌ని, లేదా స‌మాన స్థాయి వ‌స‌తి క‌ల్పించాల‌ని కూడా ఆమె పిటిష‌న్‌లో విజ్ఞ‌ప్తి చేశారు.

విజ‌య్‌కి టైమ్ బాగాలేదా..?

కాగా విజ‌య్‌ని త‌మిళ‌నాడులో త‌ళ‌ప‌తిగా అభిమానులు పిలుస్తుంటారు. ఆయ‌న త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం (టీవీకే) పార్టీని స్థాపించ‌డంతోపాటు ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాబోయే నెల‌ల్లో జ‌రిగే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇటీవ‌ల ఆయన న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ సినిమా విడుద‌ల ఆగిపోవ‌డమే కాకుండా ఇప్పుడు ఆయ‌న భార్య విడాకులు కావాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం టైమ్ బాగాలేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య్ 1998లో జూలైలో యూకేలో సంగీత‌ను వివాహం చేసుకున్నారు. విజ‌య్ ఇప్ప‌టి వ‌ర‌కు 68 చిత్రాల్లో న‌టించ‌గా, 69వ చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారు. కానీ జ‌న‌నాయ‌గ‌న్ ఇప్ప‌ట్లో విడుద‌ల అయ్యేలా క‌నిపించ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment