మేమంతా క్షేమం.. దుబాయ్‌లో శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్!

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ కొణిదెల దుబాయ్‌లో తాను, తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని అభిమానులకు భరోసా ఇచ్చారు.

March 2, 2026 10:35 PM
Sreeja Konidela's Instagram story regarding safety in Dubai during war tensions.
తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో క్షేమంగా ఉన్నట్లు తెలిపిన శ్రీజ కొణిదెల. Photo Credit: Sreeja Konidela/Instagram/iStock.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ కొణిదెల దుబాయ్‌లో తాను, తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో బుర్జ్ ఖలీఫా, దుబాయ్ స్కైలైన్ ఉదయ సూర్యోదయ కాంతుల్లో కనిపిస్తూ యూఏఈ జెండా ఎగురుతోంది. ఆ చిత్రంపై వి చూజ్ దిస్ కంట్రీ, అండ్ వి స్టాండ్ విత్ ఇట్ అనే సందేశం ఉంది. మరో స్టోరీలో ఆమె ఇలా రాశారు. ప్రతి కాల్, ప్రతి మెసేజ్‌కు ఎంతో కృతజ్ఞతలు. మీ ప్రేమ ఎంతో విలువైనది. మేము ఇక్కడ దుబాయ్‌లో సురక్షితంగా ఉన్నాం, బాగా రక్షించబడ్డాం. శాంతి, ప్రశాంతత కోసం ప్రార్థనలు.. అని పేర్కొన్నారు. శ్రీజ ప్రస్తుతం తన కుమార్తెలు నివ్రుతి, నవిష్కాతో యూఏఈలో నివసిస్తున్నారు.

దుబాయ్ లో ఉన్న ప్ర‌ముఖులు వీరే..

కాగా ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ప్రముఖుల్లో త‌మిళ న‌టుడు అజిత్ కుమార్‌, మంచు విష్ణు, సోనాల్ చౌహాన్‌, ఈషా గుప్తా కూడా ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 28న విష్ణు దుబాయ్ ఆకాశంలో క్షిపణులు కనిపిస్తున్న వీడియోను పంచుకున్నారు. ఇంటర్‌సెప్షన్ శబ్దాలతో తన కుమార్తె ఆయ్రా భయపడిందని వెల్లడించారు. యూఏఈ రక్షణ దళాలకు పౌరుల భద్రత కోసం కృతజ్ఞతలు తెలిపారు.

ఇక శ్రీజ కొనిదెల‌ చిరంజీవి-సురేఖ దంపతుల చిన్న కుమార్తె. 2007లో తన కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా శిరీష్ భ‌రద్వాజ్‌ను వివాహం చేసుకోవడంతో వార్తల్లో నిలిచారు. 2008లో వారికి నివ్రుతి జన్మించింది. 2014లో వివాహబంధం విరమించుకున్నారు. 2024లో శిరీష్ ఆరోగ్య సమస్యలతో మరణించారు. 2016లో తన బాల్యస్నేహితుడు కళ్యాణ్ దేవ్‌ను శ్రీ‌జ‌ వివాహం చేసుకున్నారు. 2018లో నవిష్కా జన్మించింది. అనంతరం 2022లో వీరు విడిపోయారు. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తమ భద్రతపై స్పష్టతనిస్తూ అభిమానులకు ధైర్యం ఇస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment