ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ ధర తగ్గింపు.. ఏకంగా రూ. 21,000 ఆదా చేసే సూపర్ ఛాన్స్!

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది అనుకూల సమయం. ఎందుకంటే సాధారణంగా యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది తాజాగా విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్ల‌స్‌కు భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వ‌చ్చింది.

February 16, 2026 8:00 PM
iPhone 16 Plus at a discounted price on Vijay Sales India.
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై అదిరిపోయే డీల్. Photo Credit: CNET.

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది అనుకూల సమయం. ఎందుకంటే సాధారణంగా యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది తాజాగా విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్ల‌స్‌కు భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వ‌చ్చింది. బేస్ డిస్కౌంట్‌తోపాటు బ్యాంక్ ఆఫర్ కలిపి చూసుకుంటే రూ.21 వేలకుపైగా ఆదా చేసే అవకాశం ఉంది. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండ‌వన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఐఫోన్‌ను కొనాల‌నే ఆలోచనలో ఉన్నవారికి ఇది మంచి అవకాశంగా చెప్ప‌వ‌చ్చు.

రూ.21వేల వ‌ర‌కు ఆదా..

భారత మార్కెట్‌లో ఐఫోన్ 16 ప్ల‌స్‌ను యాపిల్ రూ.89,900 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ రూ.71,890కే లభిస్తోంది. అంటే ఎలాంటి కూపన్ లేదా ఎక్స్చేంజ్ అవసరం లేకుండానే నేరుగా రూ.18,010 తగ్గింపు లభిస్తున్నట్లే. ఇదే కాదు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఎంపిక చేసుకుంటే అదనంగా రూ.3,500 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీంతో ఫైనల్ ధర మరింత తగ్గి, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లభిస్తున్న ఉత్తమ ఐఫోన్ డీల్స్‌లో ఇది ఒకటిగా మారింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. స్టాక్ పూర్తయితే లేదా ఆఫర్ ముగిసిన తర్వాత ధర మళ్లీ సాధారణ స్థాయికి చేరే అవకాశముంది. అందుకే ఇప్పటికే ఐఫోన్ 16 ప్ల‌స్‌ను కొనుగోలు చేయాల‌ని చూస్తుంటే ఆలస్యం చేయకుండా కొన‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు..

ఫీచర్ల పరంగా చూస్తే ఐఫోన్ 16 ప్ల‌స్ లో యాపిల్ ఎ18 చిప్‌సెట్ ను ఇచ్చారు. ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. స్మూత్ యూజర్ అనుభవాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా ఇందులో పొంద‌వ‌చ్చు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్‌ కెమెరా, 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ముందుభాగంలో 12 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండ‌గా, అందులో వీడియోలు, గేమ్స్ ను అద్భుతంగా ఆస్వాదించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌కు ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ప్రీమియం లుక్ కోసం అల్యూమినియం బాడీని ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో సుమారు 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని యాపిల్ తెలిపింది. దీర్ఘకాలిక రోజువారీ వినియోగానికి ఇది సరిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు లేదా స్టాక్ ఉన్నంత వరకే అందుబాటులో ఉంటాయి. కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్‌లో ధరను మరోసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment