
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్‌కు అనుకూలమైన కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449 (+జీఎస్టీ)తో లభించే ఈ జియోప్లస్ ప్లాన్‌లో ఒకే బిల్లుపై నాలుగు సిమ్‌లను (1 ప్రధాన సిమ్ + 3 యాడాన్ సిమ్‌లు) ఉపయోగించుకోవచ్చు. వేర్వేరు రీచార్జ్‌ల అవసరాన్ని తగ్గిస్తూ, కుటుంబ ఖర్చులను నియంత్రించేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది.
ప్లాన్ మొత్తానికి 75జీబీ డేటా..
ఈ ప్లాన్‌లో మొత్తం కుటుంబానికి కలిపి 75జీబీ షేరబుల్ డేటా లభిస్తుంది. 75జీబీ పూర్తయిన తర్వాత అదనపు డేటాకు రూ.10/జీబీ చొప్పున ఛార్జ్ చేస్తారు. అన్ని సిమ్‌లకూ అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందుతాయి. యాడాన్ సభ్యుడికి నెలకు రూ.150 అదనపు ఖర్చు ఉండగా, ప్రతి అడాన్ సిమ్‌కు 5జీబీ డేటా కేటాయిస్తారు. ఒకే బిల్లుతో అన్ని కనెక్షన్లు నిర్వహించుకోవడం వల్ల విడివిడిగా రీచార్జ్‌లతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు.
జియో ఇతర సేవలు కూడా..
వినోదం విషయంలోనూ ఈ ప్లాన్ ఆకట్టుకుంటోంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి ఉచిత ఓటీటీ సేవలు అందుబాటులో ఉంటాయి. 5జి ఫోన్ ఉన్నవారికి అన్లిమిటెడ్ 5జి డేటా సౌకర్యం కూడా ఉంది. కొంతమంది వినియోగదారులకు హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ వంటి అదనపు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఈ జియోప్లస్ ఫ్యామిలీ ప్లాన్‌ను మై జియో యాప్ ద్వారా లేదా సమీప జియో స్టోర్‌లో సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. తక్కువ ధర, ఎక్కువ డేటా, కుటుంబానికి అనుకూలమైన సౌకర్యాలు, ఓటీటీ లాభాలతో ఈ ప్లాన్ ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.








