జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరుగాంచిన నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) తన వ్యక్తిత్వం, పేరును అక్రమంగా వినియోగిస్తున్న అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

January 29, 2026 8:27 PM
Jr NTR personality rights protected by Delhi High Court
ఎన్టీఆర్ పేరు, వాయిస్, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. Photo Credit: Delhi High Court/Jr NTR/X.

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరుగాంచిన నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) తన వ్యక్తిత్వం, పేరును అక్రమంగా వినియోగిస్తున్న అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులు (Personality & Publicity Rights)కి సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నటుడి పేరు, చిత్రం, గుర్తింపులను అనధికారికంగా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

ఈ పేర్ల‌ను అక్ర‌మంగా వాడ‌కూడ‌దు..

కోర్టు తన ఉత్తర్వుల్లో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హోదాను గుర్తుచేస్తూ, ఎన్టీఆర్, తారక్, జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జూనియర్, నందమూరి తారక రామారావు జూనియర్ వంటి పేర్లు, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ వంటి బిరుదులు ప్రజల మనస్సుల్లో ప్రత్యేకంగా ఆయనకే చెందిన గుర్తింపులుగా నిలిచిపోయాయని పేర్కొంది. ఈ పేర్లు, గుర్తింపులను అనుమతి లేకుండా వాడటం ద్వారా లాభాలు పొందడం చట్టపరంగా నేరమని వెల్లడించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, వాణిజ్య ప్రకటనలు, నకిలీ ఉత్పత్తులు తదితర మార్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదా రూపాన్ని ఉపయోగించినట్లయితే, సంబంధిత కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.

నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు..

అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు లేదా అజ్ఞాత ఖాతాల ద్వారా కూడా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేయకుండా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం, నకిలీ వీడియోలు, ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు లేదా వాణిజ్య వినియోగం జరిగితే, సంబంధిత వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులకు దేశవ్యాప్తంగా కీలక రక్షణగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలు పెరుగుతున్న తరుణంలో ఈ ఉత్తర్వులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ తరఫు న్యాయవాదులు కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది కళాకారుల హక్కులను కాపాడే చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇతర ప్రముఖులు కూడా ఇలాంటి దుర్వినియోగాలపై న్యాయపరమైన రక్షణ కోరే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment