
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ భర్తీ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 28,740 తాత్కాలిక ఖాళీలు ఉండనున్నాయి, వీటికి జనవరి 31, 2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నియామకాలు గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) వంటి పోస్టుల కోసం నిర్వహించడం కారణంగా సేకరణ, డెలివరీ, శాఖ నిర్వహణ వంటి గ్రామీణ, అర్ధ-పట్టణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలకు బలం చేకూర్చేందుకు మద్దతుగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- అధికారిక నోటిఫికేషన్ విడుదల – జనవరి 31, 2026
- ఆన్లైన్ నమోదు ప్రారంభం – జనవరి 31, 2026
- దరఖాస్తు చివరి తేదీ – ఫిబ్రవరి 14, 2026
- ఫీజు చెల్లింపుకి చివరి తేదీ – ఫిబ్రవరి 16, 2026
- అప్లికేషన్ సవరణ (కరెక్షన్) – ఫిబ్రవరి 18, 19, 2026
- మెరిట్ లిస్ట్ రిలీజ్ – ఫిబ్రవరి 28, 2026
అర్హత, ఎంపిక విధానం
- దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హతగా పదో తరగతి (Class 10) విజయవంతంగా పూర్తిచేసి ఉండాలి.
- అభ్యర్థులు 18 నుండి 40 ఏళ్ల వయస్సుమధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించబడదు. మొత్తం ఎంపిక 10వ తరగతి మార్కుల ఆధారంగా తయారయ్యే మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది.
- అయితే క్లాస్ 10లో మీరు గణితం (Maths), ఆంగ్లం (English) చదివి ఉండడం తప్పనిసరి. అలాగే స్థానిక భాషలో కనీసం 10వ తరగతి స్థాయిలో పరిజ్ఞానం ఉండాలి.
ఉద్యోగ వివరణ, వేతనం
- అభ్యర్థులు ఎంపికైన తర్వాత పోస్టల్ శాఖలో వివిధ విధుల్లో పనిచేస్తారు, ఇందులో మైన్ల పంపిణీ, శాఖ నిర్వహణ, కస్టమర్ సేవలు, సేవల అమలు మొదలైనవి ఉన్నాయి.
- BPM పోస్టుల వేతనం సుమారు రూ.12,000 – రూ.29,380 మధ్య ఉంటుంది.
- GDS, ABPM పోస్టుల వేతనం రూ.10,000 – రూ.24,470 వరకు ఉండే అవకాశం ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
- అధికారిక పోర్టల్ indiapostgdsonline.gov.in ను సందర్శించండి.
- GDS Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
- మొదటి సారి నమోదుకు మెయిల్, మొబైల్ నంబర్ నమోదు చేసి రిజిస్టర్ అవ్వండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఫీజును చెల్లించండి.
- చివరగా ఫామ్‌ను సమర్పించుకుని కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ చేసుకోండి.
భారత్ పోస్ట్ GDS నియామకాలు 2026 అనేది పదో తరగతి ఉత్తీర్ణులకే ప్రకటించబడిన ఒక గొప్ప కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశంగా నిలుస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 31 నుండి ఫిబ్రవరి 14, 2026 వరకు సమర్పించుకోవచ్చు.








