మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!

అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి మాస్ ఆడియన్స్ వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ సంక్రాంతి సీజన్‌లో తిరుగులేని విజేతగా నిలిచింది.

January 26, 2026 1:38 PM
Chiranjeevi gifting luxury car to director Anil Ravipudi
మెగాస్టార్ చిరంజీవి తన డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇస్తున్న దృశ్యం. Photo Credit: Chiranjeevi/Anil Ravipudi/Social Media.

ఒక సినిమా ఘన విజయం సాధించినప్పుడు, ఆ విజయానికి కారణమైన దర్శకుడికి హీరోలు విలువైన బహుమతులు ఇవ్వడం టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా భారీ బ్లాక్‌బస్టర్‌లు అందించిన దర్శకులకు ఖరీదైన కార్లు బహుమతిగా ఇవ్వడం ఇటీవలి కాలంలో ట్రెండ్‌గా మారింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ తన చిత్రం OG ఘన విజయం సాధించడంతో దర్శకుడు సుజిత్‌కు ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మెగాస్టార్ చిరంజీవి కూడా ముందుకు వచ్చారు. తాజా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ చిత్రం చిరంజీవి – అనిల్ రావిపూడి ఇద్దరి కెరీర్‌లలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

ఖ‌రీదైన గిఫ్టు..

దర్శకుడిపై తన కృతజ్ఞతను చాటుకుంటూ, చిరంజీవి అనిల్ రావిపూడికి విలాసవంతమైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు విలువ రూ.1.40 కోట్ల నుంచి రూ.2 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. రెండు వారాలు గడిచినా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోరుతో వసూళ్లు కొనసాగుతున్న ఈ చిత్రం, ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచి విడుదల వరకు, అలాగే పండుగ రద్దీ మధ్య కూడా సక్సెస్ సాధించే వరకు ప్రతీ అంశాన్ని సమర్థంగా నిర్వహించిన దర్శకుడికి ఈ బహుమతి అందినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మన శంకర వర ప్రసాద్ గారు ఇప్పటికే ప్రాంతీయ సినిమాల్లో ఈ ఏడాది అతిపెద్ద హిట్‌గా నిలిచింది. మంచి ఆక్యుపెన్సీలతో ముందుకు సాగుతూ 400 కోట్ల రూపాయల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే ఏకగ్రీవంగా సానుకూల సమీక్షలు రావడం బాక్సాఫీస్ దూకుడుకు బలమైన పునాది వేసింది.

అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి మాస్ ఆడియన్స్ వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ సంక్రాంతి సీజన్‌లో తిరుగులేని విజేతగా నిలిచింది. ఈ విజయంతో పాటు చిరంజీవి ఇచ్చిన విలాసవంతమైన బహుమతి అనిల్ రావిపూడి కెరీర్‌లో మరో గుర్తుండిపోయే ఘట్టంగా మారిందని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment