Rashmika Mandanna : అభిమానుల‌కి షాకిచ్చిన ర‌ష్మిక‌.. సినిమాల‌కి బ్రేక్ తీసుకోవాల‌నే నిర్ణ‌యం..

November 16, 2023 7:35 PM

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మందాన ఇటీవ‌లి కాలంలో సినిమాల‌తో పెద్ద‌గా సంద‌డి చేయ‌క‌పోయిన కూడా ఆమె పేరు మాత్రం నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక న‌యా ట్రీట్‌తో ఇంటర్నెట్‌ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. తన ఫాలోవర్స్ అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సింపుల్‌గా ఆమె చేసిన పని కుర్రాళ్లకి బాడీలు హీటెక్కిపోతున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో రష్మిక మందన్నా హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇటీవల రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో నేషనల్ వైడ్ చాలా బిగ్ టాపిక్ అయ్యింది. ఆ వీడియో పై సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాంటి యాక్షన్స్ పై గవర్నమెంట్ దృష్టి పెట్టాలంటూ వ్యాఖ్యానించారు.

రష్మికకి ఎదురైన ఈ విచిత్ర అనుభ‌వం గురించి ఆమె ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడారు. ఆయన నటించిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ మూవీ రిలీజ్ కి సిద్దం అవుతున్న నేప‌థ్యంలో ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షిత్ ని రష్మిక ఫేక్ వీడియో గురించి ప్రశించారు. ఇలాంటి వాటి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్‌వేర్ కి లైసెన్స్ కంపల్సరీ అనే రూల్ తీసుకు రావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి” అంటూ చెప్పుకొచ్చారు. ర‌ష్మిక‌కి సపోర్ట్ గా అందరు కదిలి వ‌స్తున్న నేప‌థ్యంలో తనకు వచ్చిన ఆదరణ, సహకారం పట్ల ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమెకి అందిన సపోర్ట్ కింద ఆ సమస్య చిన్నదైపోయింది. దాన్నుంచి బయటపడింది రష్మిక.

Rashmika Mandanna reportedly decided to take break from movies
Rashmika Mandanna

ఇదిలా ఉంటే ర‌ష్మిక కొద్ది రోజుల పాటు సినిమాల‌కి బ్రేక్ ఇవ్వ‌బోతుంద‌నే వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ర‌ష్మిక ఆ కారణంగానే ఆమె కమిట్ అయిన సినిమాలో షూటింగ్స్ మొత్తానికి కాస్త బ్రేక్ తీసుకుంద‌ట‌. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టిన ఈ భామ త్వ‌ర‌గా హెల్త్ రిక‌వ‌రీ కావాల‌ని , ఆ త‌ర్వాతే సినిమాలు అన్న‌ట్టుగా తెలియ‌జేసింది. ఇక ఇదిలా ఉంటే ర‌ష్మిక ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్లో దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్‌` చిత్రాలు చేశారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారని టాక్‌. దీంతో అప్పట్నుంచి అడపాదడపా విజయ్‌ ఇంటికి వస్తుంది రష్మిక.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now