Prabhas And Samantha : ఏంటి.. ప్ర‌భాస్-స‌మంత సినిమా ఓకే అయిన‌ట్టేనా.. ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్..!

November 12, 2023 11:52 AM

Prabhas And Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఈ అమ్మ‌డు కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ విషయంలో సమంత హద్దులు దాటిందని నెటిజన్స్ కామెంట్స్, ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఆరోగ్యం కోసం ట్రిట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత ఐస్ బాత్ చేసి మరోసారి ట్రెండింగ్ అయింది.

మయోసైటిస్ వ‌ల‌న కొన్నాళ్లు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన స‌మంత సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ సంద‌డి చేస్తుంది. బ్యాక్ లెస్ అందాలు, బ్రా లెస్ అందాలతో పాటు.. బికినీలో దర్శనం ఇచ్చింది ఈ భామ. ఇది చూసిన నెటిజన్స్ అయితే.. సమంత ఏంటి ఇలా హాట్ షో చేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత ఫోటోస్ నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. అయితే ఏడాది త‌ర్వాత స‌మంత తిరిగి సినిమాలు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఏ హీరోతో చేయ‌నుంది అనే దానిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఇటీవ‌ల స‌మంత హాట్ స్టిల్స్ ఎక్కువ‌గా రిలీజ్ చేస్తున్ననేప‌థ్యంలో సమంత అభిమానులు, టాలీవుడ్ సినీ జనాలు మాత్రం మళ్లీ పవన్ – సమంత, మహేష్ – సమంత, ప్రభాస్ – సమంత ఇలాంటి కాంబినేషన్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అనుకుంటున్నారు.

Prabhas And Samantha may appear in new film
Prabhas And Samantha

స‌మంత స్టార్ హీరోలు అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్ స‌ర‌సన నటించేసింది. ఇక మిగిలి ఉంది ప్రభాస్ కాగా, ఆయ‌న సినిమా కోస‌మే స‌మంత ఇంత‌లా రెచ్చిపోతుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌భాస్- స‌మంత కాంబోలో సినిమా వ‌స్తే మాత్రం ఆ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌నుంద‌ని, ఆ సినిమా వ‌స్తే బాగుండ‌ని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే స‌మంత తన అందాలు చూపిస్తూ.. చేసినా ఫోటోషూట్ కు రూ.20లక్షలకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. జస్ట్ ఫోటో షూట్ కు ఇంత మొత్తం ఇవ్వడం ఏంటని కొంత మంది నోరేళ్ల బెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now