‘నిక్ జోనస్‌‌కు విడాకులు ఇవ్వబోతున్న ప్రియాంక చోప్రా.. వైరల్‌గా మారిన ట్వీట్..

July 13, 2021 7:50 PM

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించుకొని, డేటింగ్ లో ఉంటూ పెళ్లి వరకు వెళ్లి విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి వివాహ బంధానికి స్వస్తిపలికి మరొకరితో బంధం ఏర్పర్చుకున్న జంటలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంస్కృతి ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మనకు కనబడుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జంట కూడా త్వరలోనే విడిపోనున్నారనే వార్త బయటకి రావడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

నటి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే పెళ్లాడింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. పెళ్లి తర్వాత ఈ జంట వీలు చిక్కినప్పుడుడల్లా పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తూ హాట్ టాపిక్ గా ఉంటారు.ఈ విధంగా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటంతో వీరి బంధం రాబోయే పది సంవత్సరాలలో పెటాకులుగా మారబోతోందని జోస్యం చెప్పాడు సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌. ”నిక్ జోనాస్‌కు 10 ఏళ్లలో ప్రియాంక విడాకులు ఇవ్వడం తథ్యం” అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ విధంగా కమల్ ప్రియాంక చోప్రా జీవితం గురించే చేస్తున్న వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపడుతున్నారు. కొందరు నెటిజన్లు ఎంతో ఆగ్రహంతో మరో పదేళ్లలో నువ్వు కూడా చచ్చిపోతావా అంటూ అతని ట్వీట్ కి రీట్వీట్ లు పెడుతున్నారు. ఒకరి జీవితం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది అంటూ కమల్ఆర్‌ ఖాన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ విషయం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment