సీనియ‌ర్ హీరో స‌రికొత్త ప్రేమాయ‌ణం.. అవాక్క‌వుతున్న నెటిజ‌న్స్..

January 30, 2023 9:23 PM

సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అవసరాల కోసం…హోదా కోసం ఎవరు ఎవరితో అయినా కల‌వ‌క త‌ప్ప‌దు. ఎవరు ఎవరిని అయినా రకరకాలుగా ఉపయోగించుకుంటూనే ఉంటారు.. ఇక్కడ అవసరాల కోసం హీరోయిన్లు- హీరోలు, హీరోయిన్లు- దర్శకుల మధ్య ఎఫైర్లు- సహజీవనాలు చాలా కామ‌న్. వీరిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉన్నంతవరకు ఇబ్బంది లేదు.. కాని వారి అవసరాలు తీరాక ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎఫైర్లు చాలా సింపుల్ గా నడుస్తూ ఉంటాయి. తాజాగా ఓ పెద్ద హీరో ఓ అమ్మాయితో కొత్త రిలేష‌న్ మొద‌లు పెట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఆ సీనియ‌ర్ హీరో ఎప్పుడు ఎఫైర్స్ తో వార్త‌లలో నిలుస్తూనే ఉంటాడు. అమ్మాయిలు స్నేహాలు అంటే ఇష్టం అని, కానీ అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని టాక్. అప్పుడ‌ప్పుడు అత‌ని రిలేష‌న్స్ కి సంబంధించి తెగ గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ చాలా గుట్టు చప్పుడు లేకుండా సాగుతుందని టాక్. ఇలాంటి వ్యవహారాల వల్లే ఎప్పడో ఓసారి విదేశంలో పోలీసుల వల్ల ఇబ్బంది కూడా పడ్డారని అంటారు. తాజగా ఓ అమ్మాయి ఆయ‌న‌కు దగ్గరయిందని టాక్ వినిపిస్తోంది. ఆ అమ్మాయి ఓ మాజీ ప్రజా ప్రతినిధి బంధువు అని స‌మాచారం.

that senior actor reportedly in love

ఆ అమ్మాయి ఏ కారణంతో ఈయన దగ్గరకు వచ్చారో కానీ అలా అలా ఇద్దరి మధ్య బంధం పెరిగిందని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అధికార కార్యక్రమాల బంధమా? లేక అంతకు మించా అన్నది తెలియదు కాని ప్ర‌స్తుతానికి ఈ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మరింత పొగ వస్తే కాని అప్పుడు నిప్పు కనిపించే అవకాశం ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. మీటూ ఉద్య‌మం త‌ర్వాత త‌ప్పుడు ప‌నులు చేసే చాలా మంది సెల‌బ్రిటీల బాగోతాలు బ‌య‌ట‌ప‌డ్డ విష‌యం తెల‌సిందే. మ‌నోడి జాతకం కూడా ఎప్పుడో బ్లాస్ట్ కావ‌డం ఖాయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now