Shriya Saran : శ్రియ భ‌ర్త బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక‌వుతారు.. ఆయ‌న మామూలోడు కాదుగా..!

November 13, 2022 9:40 PM

Shriya Saran : ముంబైకి చెందిన బ్యూటీ శ్రియ శ‌ర‌న్.. తెలుగులో ఇష్టం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత ఈమె న‌టించిన నువ్వే నువ్వే బంప‌ర్ హిట్ అయింది. దీంతో శ్రియకు తెలుగులో పుష్క‌లంగా అవ‌కాశాలు వ‌చ్చాయి. వాటిని ఆమె స‌ద్వినియోగం చేసుకుంది. అలాగే ఆమెకు ల‌క్ కూడా క‌ల‌సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె చేసిన అనేక మూవీలు హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కొన‌సాగిస్తోంది. పెళ్ల‌యి ఒక పాప ఉన్న‌ప్ప‌టికీ గ్లామ‌ర్ షో చేసేందుకు వెనుకాడ‌డం లేదు. ఈ మ‌ధ్యే ఆమె న‌టించిన ఓ యాడ్‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసి అంద‌రికీ షాకిచ్చింది. అయితే శ్రియ భ‌ర్త ఆండ్రి కొశ్చివ్ గురించి చాలా మందికి తెలియ‌దు. ఆయ‌న ఏం చేస్తారు.. ఎంత సంపాదిస్తారు.. వంటి వివ‌రాలు తెలియ‌వు. ఆ విశేషాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రియ.. క‌రోనా టైమ్‌లో ఆండ్రి కొశ్చివ్‌ను వివాహం చేసుకుంది. అయితే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని మాత్రం ర‌హ‌స్యంగా ఉంచింది. ఒకేసారి త‌న పాప‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప‌రిచ‌యం చేసింది. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు. అయితే ఆండ్రి కొశ్చివ్ ర‌ష్యాకు చెందిన వ్య‌క్తి. అత‌ను శ్రియ‌కు ఫ్రెండ్‌. ఎప్ప‌టి నుంచో తెలుసు. త‌రువాత వారిద్ద‌రి స్నేహం ప్రేమ‌గా మారింది. పెళ్లి చేసుకున్నారు. ఇక ఆండ్రి కొశ్చివ్ టెన్నిస్ ప్లేయ‌ర్‌. అక్క‌డ జాతీయ స్థాయిలో ఆడాడు. ఆ ఆట‌కు వీడ్కోలు ప‌లికిన త‌రువాత బిజినెస్ ప్రారంభించాడు. కోట్లు సంపాదించాడు. ఆయ‌న‌కు వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఫుడ్ బిజినెస్‌లో బాగానే సంపాదిస్తున్నాడు.

Shriya Saran husband andrei koscheev do you know about him
Shriya Saran

ఇక ఆండ్రికి టెన్నిస్‌ తర్వాత అత్యంత ఇష్టమైన మరో క్రీడ వాటర్‌ సర్ఫింగ్‌. వాటర్‌ సర్ఫింగ్‌ చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టమైన ప‌ని. చిన్నతనం నుంచే గంటల కొద్దీ నీటిలో గడిపేవాడు. శ్రియా, ఆండ్రి పరిచయం విచిత్రంగా జరిగింది. ఓ బిజెనెస్‌ పనిమీద ఇండియాకు వచ్చిన ఆండ్రి.. శ్రియ‌కి ఉన్న కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. దీంతో వారు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. త‌రువాత చివ‌ర‌కు అది ప్రేమ‌కు దారి తీసింది. పెళ్లి చేసుకున్నారు. ఇక శ్రియ తెలుగులో టాప్ హీరోలు అంద‌రితోనూ యాక్ట్ చేసింది. ఇటీవ‌లే ఈమె ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టించ‌గా.. ప‌లు మూవీల‌తో ప్ర‌స్తుతం ఈమె బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now