Kantara Movie : అదేంటీ.. కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారా..? ఏంటి క‌థ‌..?

October 19, 2022 10:56 AM

Kantara Movie : సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది అనుష్క. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సత్తాచాటింది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను మరింత పెంచాయి. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైనే అయ్యింది. 40 ఏళ్లు వయసున్న స్వీటి మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆమె పెళ్లిపై ఎప్పుడూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతేకాదు వాళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై అటు ప్రభాస్, ఇటు అనుష్క స్పందించలేదు. ఇటీవల కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రం కాంతారా. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలై భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా తెలుగు వెర్షన్‌ ను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ శనివారం విడుదల చేయగా.. ఈ సినిమాపై స్టార్‌ హీరోయిన్‌ అనుష్కా శెట్టి ప్రశంసలు కురిపించింది.

Prabhas and Anushka watched Kantara Movie what is the matter
Kantara Movie

ఓ పక్క కాంతారా మూవీ త్రూ అవుట్ ఇండియాను షేక్ చేస్తుంటే.. మరో పక్క ఈ సినిమాను చూశామంటూ ట్వీట్‌ చేసిన ప్రభాస్, అనుష్కల మ్యాటర్ మరోసారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరు కలిసే ఈ సినిమా చూశారనే డౌట్‌ను అందరిలో కలిగేలా చేస్తోంది. ఇప్పుడిదే.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్, అనుష్కల మధ్య ఏదో ఉందని.. అది లవ్‌ అనే అనుకుంటున్న నెటిజన్స్‌కు.. కాంతారా మూవీపై వీరు చేసిన ట్వీట్‌.. ఇప్పుడు హింట్ గా మారింది. వీరిద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారా.. అనే అనుమానం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now