Godfather : గాడ్ ఫాద‌ర్ హిట్ కావాలి అంటే.. ఎంత వ‌సూలు చేయాలో తెలుసా..?

October 4, 2022 8:49 PM

Godfather : టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలిసి నటించిన‌ లేటెస్ట్ పొలిటికల్ డ్రామా గాడ్ ఫాదర్. మళ‌యాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలాంటి డిజాస్టర్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్. అయితే ఈ మూవీ బిజినెస్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలతో పోలిస్తే గాడ్ ఫాదర్ లోయెస్ట్ గా ఉంది. ఆచార్య ఇంపాక్ట్ గాడ్ ఫాదర్ పై క్లియర్ గా కనిపిస్తుందని చెప్పవచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ పాజిటివ్ గా ఉంటే అవలీలగా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది. కొన్ని ఏరియాల్లో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేస్తున్నా వాల్యూ బిజినెస్ ఎంత ఉంటుంది అన్న ఎస్టిమేషన్స్ తో బిజినెస్ ను ఒకసారి చూద్దాం.

Godfather Chiranjeevi movie how much it has to collect
Godfather

నిజాం 22Cr, సీడెడ్ 13.50Cr, ఆంధ్రా 35Cr, టోటల్ ఏపీ, టీజీ 70.50Cr, కర్ణాటక 6.50Cr, హిందీ 6.50Cr(Valued), ఓవర్ సీస్ 7.5Cr, మొత్తం వరల్డ్ వైడ్ 91Cr ఇది ఓవరాల్ గా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. మొత్తానికి ఇప్పుడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమం రూ.92 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాలి. దసరా బరిలో ఘోస్ట్, గాడ్ ఫాదర్ ఉండగా ఎవరు దసరా విజేతగా నిలుస్తారో చూడాలి. ఏది ఏమైనా గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే కానీ చిరు ఆచార్య డిజాస్టర్ నుంచి బయటకు వచ్చేలా లేడు. గాడ్ ఫాదర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment