India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Chiranjeevi : 29 రోజుల్లో సినిమాని తీస్తే.. 500 రోజులు ఆడింది.. ఆ చిరంజీవి మూవీ ఏదంటే..?

Mounika by Mounika
Sunday, 2 October 2022, 4:44 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Chiranjeevi : టాలీవుడ్ కి ఇద్దరు అద్భుతమైన దర్శకులను అందించిన ఘ‌న‌త ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్ అధినేత కే రాఘ‌వ గారికే ద‌క్కుతుంది. కే రాఘ‌వ నిర్మాణ సారథ్యంలో తాత మ‌న‌వ‌డుతో దాస‌రి నారాయ‌ణ‌రావు, ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. దాస‌రి నారాయ‌ణరావుకి కోడి రామ‌కృష్ణ శిష్యుడు కావడం మరొక విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం 1982 ఏప్రిల్ 23న వేసవి బరిలో దిగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం గాను, హారోయిన్ మాధవి జయలక్ష్మి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పూర్ణిమ, పి.ఎల్.నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించగా, మాటల రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా తొలిసారి ఈ చిత్రంతో పరిచయమయ్యారు.

Chiranjeevi movie completed in 29 days played 500 days know it
Chiranjeevi

ఇక కథలోకి వెళ్తే రాజశేఖరం (చిరంజీవి) ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) ప్రేమ మాయలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కొత్త కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల బుద్ది ప్రవర్తన గల సుబ్బారావు(గొల్లపూడి) జయలక్ష్మి(మాధవి) మీద కన్నేస్తాడు. మాయమాటలు చెప్పి ఎంతోమంది అమాయక ఆడవాళ్ళని మోసం చేస్తాడు సుబ్బారావు. జయలక్ష్మికి రాజశేఖరం మీద లేనిపోనివన్నీ చెప్పి ఆ జంటను విడదీస్తాడు సుబ్బారావు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కారం చూపిస్తారు అన్నదే ఈ చిత్ర కథాంశం.

అప్పట్లో ఈ చిత్రాన్ని కేవలం 29 రోజుల్లోనే కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూ.3ల‌క్ష‌ల 20వేల వ్య‌యంతో ఈ చిత్రానికి పాల‌కొల్లు, న‌ర్సాపురం, పోడూరు, స‌ఖినేటిప‌ల్లి, భీమ‌వ‌రం, మ‌ద్రాస్‌ల‌లో సినిమా షూటింగ్స్ జ‌రిపారు. సినిమా పనులు పూర్త‌య్యాక సెన్సార్ విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాఘ‌వ పట్టుదలతో పోరాడి సెన్సార్ ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ సినిమాతో గ‌ట్టి పునాది వేసుకున్న ద‌ర్శ‌కుడు కోడిరామ‌కృష్ణ ఆ త‌రువాత స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎదిగారు.

1982 ఏప్రిల్ 23న విడుద‌లైన ఈ సినిమాకి మొదట యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత కాల‌క్ర‌మేణా ప్రేక్ష‌కాద‌ర‌ణ పెరిగి సూప‌ర్ హిట్ గా నిలిచింది. 8 కేంద్రాల్లో 50 రోజులు, కొన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడి మంచి కలెక్షన్లు రాబట్టింది. హైదరాబాద్ సిటీ లో ఈ సినిమా ఏకంగా 512వ రోజు వ‌ర‌కు ఆడింది. అప్ప‌టికే యాక్ష‌న్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవిని రాజ‌శేఖ‌ర్ అనే హాస్యం మేళ‌వించిన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించ‌డం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఈ చిత్రంతో చిరంజీవి యాక్షన్  హీరోగానే కాదు, ఫ్యామిలీ హీరోగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Tags: chiranjeevi
Previous Post

Memory Power : ఇది వ‌జ్రంతో స‌మానం.. ఎంత తింటే.. అంత మేథ‌స్సు, తెలివితేట‌లు పెరుగుతాయి..!

Next Post

Nagarjuna : నాగార్జున రంగేసుకొని.. వాళ్ళు చెప్పినట్టు చేస్తాడు.. బిగ్ బాస్ పై శ్రీరెడ్డి కామెంట్స్..!

Related Posts

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Tuesday, 13 January 2026, 4:22 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by IDL Desk
Tuesday, 13 January 2026, 4:22 PM

...

Read more
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
వార్తా విశేషాలు

Asalem Jarigindi Review : ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగే.. అస‌లేం జ‌రిగింది.. మూవీ రివ్యూ..!

by Sunny
Friday, 22 October 2021, 10:04 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.