Rashmika Mandanna : చివరకు దానికి కూడా రష్మిక ఓకే చెప్పడంతో.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్..!

September 11, 2022 2:15 PM

Rashmika Mandanna : అందాల భామ రష్మిక క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. అంతే కాదు.. స్టార్ హీరోలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్దమ‌వుతోంది. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటించనుంది. ఇటీవల విడుదలైన సీతారామంలోనూ ఆమె కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా నేషనల్ క్రష్ గా కూడా బిరుదు అందుకుంది. ఇక ఈ పాపులారిటీతోనే బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటోంది.

ప్ర‌స్తుతం రష్మిక మందన్న బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలకు కమిట్ అయింది. దాదాపు 7 సినిమాల్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ తో కమిట్ అయిన సినిమా నుండి రష్మిక తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అనుకున్న రష్మిక.. ఓ బోల్డ్ నిర్ణయం తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna took important decision fans happy
Rashmika Mandanna

బాలీవుడ్ లో ఓ ప్రముఖ స్టార్ సినిమాలో బికినీలో దర్శనం ఇవ్వనుందట రష్మిక. ఇప్పటివరకు రష్మికని మనం మోడ్రెన్, డీ గ్లామర్ రోల్స్ లోనే చూశాం. బికినీలో ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం ఆ హీరో కోసం బికినీ వేసుకోవడానికి సై అన్నదట రష్మిక. ఈ వార్త విన్న ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఎప్పుడెప్పుడు రష్మిక ని బికినీలో చూద్దామా అంటూ వెయిట్ చేస్తున్న కుర్రకారుకి పండగే ఇది. ఇక బికినీలో రష్మిక యూత్ కి ఎలాంటి హీట్ పుట్టిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now