Rashmika Mandanna : లెహంగా వోణీలో అందాలు ఆరబోసిన రష్మిక.. కుర్రకారు మతులు పోగొడుతున్న శ్రీవల్లి..

September 9, 2022 7:18 PM

Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావ‌డానికి కొంత టైం ప‌డుతుంది. అదే కొంద‌రు న‌టీమ‌ణులు మాత్రం ఒక‌టి రెండు సినిమాల‌తోనే స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న‌. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్ప సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.

ర‌ష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తను నటించిన తొలి హిందీ ఫిల్మ్ గుడ్ బై విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్ర‌మంలో మూవీ ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. తాజా ఈవెంట్ లో రష్మిక మందన్న ఎంట్రీ అదిరిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో ఈ స్టార్ హీరోయిన్ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ప్రింటెడ్ లెహంగా, వోణీ ధరించిన రష్మిక నాజూకు అందాలను విందు చేసింది. తన ప్రజెన్స్ తో ఈవెంట్ ను మరింత ఆకర్షణీయంగా మార్చేసింది.

Rashmika Mandanna latest trendy dress photos viral
Rashmika Mandanna

ర‌ష్మిక‌ని చూసిన ఆమె అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బడ్డారు. వారికి సెల్ఫీలు ఇస్తూ స‌ర‌దాగా ముచ్చ‌టించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఇటీవల సీతారామం మూవీలో ఒక కీలక రోల్ చేసి మంచి పేరు అందుకున్న రష్మిక, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కి కూతురుగా గుడ్ బై మూవీలో కనిపించనుండగా వికాస్ బాల్ దీనిని తెరకెక్కించారు. కామెడీతో కూడిన ఎమోషనల్ డ్రామా మూవీగా తెరకెక్కిన గుడ్ బై అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది రష్మిక.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment