Chiranjeevi : చిరంజీవిపై విష ప్ర‌యోగం జ‌రిగిన మాట నిజ‌మే.. ముర‌ళీమోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

July 24, 2022 10:17 AM

Chiranjeevi : సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ ఈమ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఈయ‌న ఇటీవ‌లే ఓ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య త‌మ ఇంటికి స‌మీపంలోనే ఉండేవార‌ని.. వారు ఉన్న అపార్ట్‌మెంట్‌ను తన‌దేన‌ని.. గ‌తంలో దాన్ని చైత‌న్య‌కు విక్ర‌యించాన‌ని తెలిపారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట ఎందుకు విడిపోయింది అనే విష‌యం అర్థం కాలేద‌ని.. వారు విడిపోతున్న విష‌యం త‌న‌కు ముందుగానే తెలిసి ఉంటే.. వారికి ఎలాగో స‌ర్దిచెప్పి వారిని క‌లిపి ఉంచేవాడిన‌ని అన్నారు.

ఇక ముర‌ళీ మోహ‌న్ చిరంజీవిపై కూడా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. చిరంజీవిపై అప్ప‌ట్లో విష ప్ర‌యోగం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని అన్నారు. అప్ప‌ట్లో మ‌ర‌ణ‌మృదంగం సినిమాకు గాను షూటింగ్‌ను చెన్నైలో చేస్తున్నారు. అయితే చిరంజీవి రోజూ షూటింగ్‌లో య‌థావిధిగా ఒక‌సారి బ‌య‌ట‌కు వ‌చ్చి ఫ్యాన్స్‌ను క‌లిసి మ‌ళ్లీ లోప‌లికి వెళ్తుంటారు. ఇది రోజువారీ దిన‌చ‌ర్య‌. దీంతో ఆయ‌న‌ను చూసేందుకు షూటింగ్‌కు చాలా మంది వ‌చ్చేవారు. అలా ఒక రోజు ఒక వ్య‌క్తి త‌న పుట్టిన రోజ‌ని చెప్పి చిరంజీవిచే కేక్ క‌ట్ చేయించాడు. త‌రువాత ఆయ‌న వ‌ద్దంటున్నా బ‌ల‌వంతంగా ఆయ‌న‌కు కేక్‌ను తినిపించాడు. దీంతో ఆయ‌న అయిష్టంగానే కేక్ తిని అక్క‌డి నుంచి వెంట‌నే లోప‌లికి వచ్చేశారు.

Murali Mohan said poison attempt on Chiranjeevi is true
Chiranjeevi

అయితే ఆయ‌న పెద‌వులు నీలం రంగులోకి మార‌డాన్ని గుర్తించిన షూటింగ్ సిబ్బంది వెంట‌నే ఆ విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పారు. దీంతో ఆయ‌న హుటాహుటిన హాస్పిట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు వైద్యులు చికిత్స చేశారు. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల అనంత‌రం ఆయ‌న డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లో తెగ క‌ల‌క‌లం రేపింది. చిరంజీవి అప్ప‌ట్లో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కొన‌సాగుతున్నారు. ఆయ‌న సక్సెస్‌ను, పేరును చూసి ఓర్వ‌లేకే ఆయ‌న‌ను అంత‌మొందించేందుకు ఎవ‌రైనా విష ప్ర‌యోగం చేసి ఉండ‌వ‌చ్చ‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే ముర‌ళీ మోహ‌న్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment