Rashmika Mandanna : డ‌బ్బు కోసం ఏమైనా చేస్తావా.. ర‌ష్మిక మంద‌న్న‌పై భారీగా ట్రోలింగ్‌..!

July 19, 2022 10:36 PM

Rashmika Mandanna : క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా దూసుకుపోతోంది. చేతిలో వ‌రుస‌గా సినిమాలు ఉండ‌డంతో ఈ అమ్మ‌డు ఆగ‌డం లేదు. ఈమె స్పీడుకు బ్రేకులు లేకుండా పోయాయి. ఇప్ప‌టికే ప‌లు హిందీ మూవీల్లో న‌టిస్తున్న ఈమెకు ఇంకా ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో హీరోయిన్లు డ‌బ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకాడ‌డం లేదు. ముఖ్యంగా బోల్డ్ సీన్ల‌లో న‌టించేందుకు ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌డం లేదు. అయితే ఈ మాట అటుంచితే ర‌ష్మిక మంద‌న్న తాజాగా చేసిన ప‌ని నెటిజ‌న్ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది.

ప్ర‌ముఖ న‌టుడు విక్ర‌మ్ న‌టించిన పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ వ‌న్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న త‌రువాతి మూవీని కూడా అనౌన్స్ చేశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ త‌న 61వ సినిమాను చేయ‌నున్నారు. అయితే ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తీసుకున్న నిర్ణ‌యం ఫ్యాన్స్‌కు న‌చ్చ‌డం లేదు. పైగా ఇందులో ఆమె బోల్డ్ సీన్ల‌లోనూ న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.

Rashmika Mandanna being trolled by netizen for her chances
Rashmika Mandanna

డ‌బ్బులు ఇస్తే నీక‌న్నా వ‌య‌స్సులో ఎంత పెద్ద హీరోతో అయినా న‌టిస్తావా.. బోల్డ్ సీన్ల‌లోనూ చేస్తావా.. డ‌బ్బుల కోసం ఏమైనా చేసే ర‌కం నువ్వు.. అంటూ నెటిజ‌న్లు ర‌ష్మిక‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారిక వివ‌రాలు తెలియ‌క‌పోయినా ర‌ష్మిక మాత్రం ట్రోలింగ్‌కు గుర‌వుతోంది. ఇక ఈమె ప్ర‌స్తుతం మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై అనే హిందీ మూవీల్లో న‌టించ‌గా.. సీతారామ‌మ్‌, పుష్ప 2 తెలుగు మూవీల్లో చేస్తోంది. అలాగే త‌మిళంలో వ‌రిసులోనూ యాక్ట్ చేస్తోంది. హిందీలో యానిమ‌ల్ అనే మూవీలోనూ ఈమె న‌టించనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now