Chiranjeevi : ముగ్గురు అక్క చెల్లెళ్ల‌తోనూ న‌టించిన మెగాస్టార్ చిరంజీవి.. వారు ఎవ‌రో తెలుసా..?

June 29, 2022 8:01 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు వంటి న‌టుల ప్ర‌భంజ‌నంలోనూ చిరంజీవి నిల‌దొక్కుకుని స్టార్‌గా ఎదిగారు. ఆయన సినీ ప్రస్థానంలో మూడు ద‌శాబ్దాల హీరోయిన్ల‌తో న‌టించారు. ఇప్ప‌టికీ న‌టిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కెరీర్‌లో చాలా మంది హీరోయిన్ల‌తోనూ న‌టించారు. అయితే ఓ ముగ్గురు హీరోయిన్ల‌తో చిరంజీవి చేయ‌గా.. వారు ముగ్గురూ అక్కా చెల్లెళ్లు కావడం విశేషం. ఇంత‌కీ ఆ అక్కా చెల్లెళ్లు ఎవ‌రు.. అంటే..

మెగాస్టార్ చిరంజీవి న‌గ్మాతో ప‌లు చిత్రాల్లో నటించారు. ఆమెతో క‌లిసి ఘ‌రానా మొగుడు చేయ‌గా.. అప్ప‌ట్లో ఈ మూవీ భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. త‌రువాత ఆమెతో ముగ్గురు మొన‌గాళ్లు, రిక్షావోడు వంటి చిత్రాల‌ను కూడా చిరంజీవి చేశారు. ఇక న‌గ్మా చెల్లెళ్లు రోషిణి, జ్యోతిక అన్న విష‌యం తెలిసిందే. చిరంజీవి రోషిణితో క‌లిసి మాస్ట‌ర్ అనే మూవీలో న‌టించారు. ఈ మూవీలో ఆయ‌న కాలేజీ ప్రొఫెస‌ర్‌గా అద‌ర‌గొట్టేశారు. కాలేజీలో చెడ్డ దారిలో వెళ్తున్న విద్యార్థుల‌ను మంచి దారిలో న‌డిచేలా చేసి వారిని ప్ర‌యోజ‌క‌లుగా మార్చే మాస్ట‌ర్‌గా చిరంజీవి న‌టించారు. ఈ మూవీ కూడా హిట్ అయింది.

Chiranjeevi acted with all three sisters know who are they
Chiranjeevi

ఇక న‌గ్మా ఇంకో చెల్లెలు జ్యోతిక‌తోనూ చిరు న‌టించారు. ఆమెతో చేసిన ఠాగూర్ సినిమా భారీ హిట్ అయింది. అవినీతి నాయ‌కులు, అధికారుల భ‌ర‌తం ప‌ట్టే నికార్స‌యిన వ్య‌క్తిగా చిరంజీవి ఠాగూర్‌లో క‌నిపించారు. ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇలా చిరంజీవి ముగ్గురు అక్కాచెల్లెళ్ల‌తోనూ న‌టించారు. ఇలా చేయ‌డం చాలా అరుదుగా జ‌రుగుతూ ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment