---Advertisement---

Rashmika Mandanna : అందాల జాత‌ర‌కు తెర లేపిన ర‌ష్మిక మంద‌న్న‌..!

May 14, 2022 9:34 PM
---Advertisement---

Rashmika Mandanna : చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ ర‌ష్మిక మంద‌న్న‌కు మాత్రం నేష‌న‌ల్ క్ర‌ష్ అనే పేరు వ‌చ్చింది. ఇక పుష్ప మొద‌టి పార్ట్ హిట్ కావ‌డం.. అది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావ‌డంతో.. ఎక్క‌డ చూసినా శ్రీ‌వ‌ల్లి అలియాస్ ర‌ష్మిక పేరు మారుమోగిపోతోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఆ భాష‌, ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాష‌ల‌కు చెందిన సినీ ఇండ‌స్ట్రీల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే ఈమె మాత్రం ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. కెరీర్ ను చ‌క్క‌గా నిర్మించుకుంటోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ర‌ష్మిక మందన్న ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈమె అందులో షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ర‌ష్మిక మందన్న ప్ర‌స్తుతం త‌న జోరును కొన‌సాగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో ఆమెకు భారీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. దీంతోపాటు యాడ్స్‌లోనూ న‌టిస్తూ పిచ్చెక్కిస్తోంది. గ‌తంలో ఒక‌సారి అండ‌ర్ గార్మెంట్స్‌కు చెందిన యాడ్‌లో న‌టించిన ఈమె న‌వ్వుల పాలైంది. అయిన‌ప్ప‌టికీ ఈమె ప‌ట్టించుకోలేదు. తన ప‌నేదో తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక తాజాగా ఈమె తన సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేసిన ఫొటోలు మ‌తులు పోగొడుతున్నాయి. అందాల‌ను చూపిస్తూ జాత‌ర ఏర్పాటు చేసిన‌ట్లు రష్మిక మారింది. ఈ క్ర‌మంలోనే ఆమె చాలా చిన్న‌దైన షార్ట్ ధ‌రించి అల‌రిస్తోంది.

Rashmika Mandanna latest pink orange color dress
Rashmika Mandanna

ఇక ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో వ‌రుస మూవీలు చేస్తోంది. అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప 2లో సంద‌డి చేయ‌నుంది. అలాగే తమిళంలో విజ‌య్‌తో సినిమా చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈమె హిందీలో మిష‌న్ మ‌జ్ను, గుడ్‌బై, యానిమ‌ల్ అనే మూడు సినిమాల్లో చేస్తోంది. దీంతో ర‌ష్మిక గ‌తంలో ఎన్న‌డూ లేనంత బిజీగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమాలు అన్నీ రానున్న 2 ఏళ్ల‌లో విడుద‌ల కానున్నాయి. ఇవ‌న్నీ హిట్ అయితే నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ స్టేట‌స్ ను ఈమె సొంతం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now