ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్.. రెండో స్థానానికి చేరుకున్న భార‌త్‌..

March 29, 2021 5:49 PM

ఇంగ్లండ్‌తో ఇటీవ‌ల జ‌రిగిన మూడు సిరీస్‌ల‌ను భార‌త్ కైవ‌సం చేసుకున్న విష‌యం విదిత‌మే. తొలుత టెస్టు సిరీస్‌ను 3-1తో త‌రువాత టీ20 సిరీస్ ను 3-2తో భార‌త్ స్వాధీనం చేసుకుంది. తాజాగా వ‌న్డే సిరీస్‌ను 2-1తో ద‌క్కించుకుంది. చివ‌రి వ‌న్డేలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో భార‌త్ ఎట్టకేల‌కు విజ‌యం సాధించింది.

icc released latest odi rankings team india reached to 2nd place

అయితే వ‌న్డే సిరీస్‌ను ద‌క్కించుకోవ‌డంతో భార‌త్ ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ 121 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, భార‌త్ 119 పాయింట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. న్యూజిలాండ్ 118 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉంది. ఇటీవ‌ల బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ న్యూజిలాండ్ అదే స్థానంలో స్థిర‌ప‌డింది. అయితే వ‌న్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన భార‌త్ 119 పాయింట్ల‌ను పొందింది. దీంతో వ‌న్డే ర్యాంకింగ్‌ల‌లో 2వ స్థానానికి చేరుకుంది.

ఇక టెస్టుల‌లో భార‌త్ మొద‌టి స్థానంలో ఉండ‌గా, టీ20ల‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. కాగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 14వ ఎడిష‌న్ ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మొద‌లు కానుండడంతో ఇప్ప‌టికే భార‌త ఆట‌గాళ్లంద‌రూ త‌మ త‌మ టీమ్‌ల వ‌ద్ద‌కు చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్ మ‌ళ్లీ క్రికెట్ స‌మ‌రం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment