Chiranjeevi : పూజా హెగ్డెను హ‌త్తుకోబోయిన చిరంజీవి.. విమ‌ర్శిస్తున్న యాంటీ ఫ్యాన్స్‌..!

April 27, 2022 7:02 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎక్క‌డ‌కు వెళ్లినా చాలా ప‌ద్ద‌తిగా వ్య‌వహ‌రిస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఇటీవ‌ల రాజ‌మౌళి తాను హుందాగా ఉండ‌డానికి కార‌ణం చిరంజీవి అని ఆయ‌నపై ప్ర‌శంస‌లు కురిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌లి కాలంలో చిరంజీవి చాలా నాటీ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇటీవ‌ల తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన చిరు ఆమెపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తాప్సీతో న‌టించే ఛాన్స్ పోయిందంటూ ఓ ర‌క‌మైన కామెంట్స్ చేశారు.

Chiranjeevi gesture towards Pooja Hegde netizen angry
Chiranjeevi

ఇక రీసెంట్‌గా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూజా హెగ్డెపై తెగ ప్రేమ కురిపించారు. పూజ ఈజ్ సో క్యూట్. నా భార్య నిన్ను చూసినప్పుడల్లా.. ఓ రకంగా ప్రేమించేస్తుంటుంది. సురేఖ నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్. నీ నవ్వు బాగుంటుంది అని ఎప్పుడూ నాతో చెబుతుంటుంది. ఈ మూవీలో రామ్‌చరణ్‌ కు జోడిగా చేశావ్ కానీ.. నాతో చేస్తే ఇంకా బాగుండేది.. అని చిరంజీవి అన్నారు. ఇక తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోటో సెష‌న్ అప్పుడు చిరంజీవి.. పూజా హెగ్డెతో చాలా చిలిపిగా వ్య‌వ‌హ‌రించారు.

పూజా హెగ్డెని గ‌ట్టిగా హ‌త్తుకోబోతున్న‌ట్లు చేశారు. రామ్ చ‌ర‌ణ్ ను ప‌క్క‌న ఉండ‌మ‌ని చెప్పి, పూజాతో వ‌రుస ఫొటోలు కూడా దిగారు. ఈ వ్య‌వ‌హారం చిరు యాంటీ ఫ్యాన్స్ కి న‌చ్చ లేదు. అందుకే తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే చిరులో ఉన్న ఫన్ సైడ్ ని అర్దం చేసుకోకుండా ఇలాంటి కామెంట్స్ ఏంట‌ని కొంద‌రు తిట్టిపోస్తున్నారు. ఇక ఏప్రిల్ 29న ఆచార్య విడుద‌ల కానున్న నేప‌థ్యంలో కొద్ది రోజులుగా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డె ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో తెగ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment