---Advertisement---

Pawan Kalyan : ప‌వన్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజెనోవాకు ఎంత ఆస్తి ఉందో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోతుంది..!

April 20, 2022 2:39 PM
---Advertisement---

Pawan Kalyan : టాలీవుడ్‌లో మంచి స్టార్‌డమ్‌ ఉన్న హీరోల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌రు. ఆయ‌న‌ని న‌టుడిగా క‌న్నా కూడా ఆయన వ్య‌క్తిత్వానికి ఎక్కువ మంది ఫిదా అవుతుంటారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లైఫ్‌లో ఓ రిమార్క్ ఉంది. ప్ర‌తిప‌క్షాలు ఇదే పాయింట్‌ని ప‌ట్టుకొని ప‌వ‌న్‌ని విమ‌ర్శిస్తుంటారు. మ‌రి కొంద‌రు మాత్రం ఈ విష‌యంలో ప‌వ‌న్‌ని వెన‌కేసుకొస్తుంటారు. ఫస్ట్ వైఫ్ ఇప్పటికీ కూడా ఆయన గురించి చాలా మంచిగా చెప్తుంది. ఆయన చెడ్డవాడు అయితే అంత ఫాలోయింగ్ ఎలా ఉంటుంది. చాలా మంది అంటుంటారు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అని. అది ఆయన ఇష్టం. నా లైఫ్ నాశనం చేశాడు ఈ పవన్ కళ్యాణ్ అని ఏ భార్యా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయలేదు. ఆయన లీగల్‌గానే పెళ్లి చేసుకున్నాడు క‌దా, ముగ్గుర్ని అంటుంటారు. ఏది ఎలా ఉన్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రికి విడాకులు ఇచ్చాక ర‌ష్యా దేశ‌స్థురాలు అన్నా లెజెనోవాను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తీన్మార్ సినిమాలో అన్నా లెజెనోవా న‌టించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డారు.

do you know about pawan kalyan wife anna lezhneva assets
Pawan Kalyan

2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ ని మొదటిసారిగా కలిసింది అన్నా. అయితే ఆ సమయంలోనే పవన్, అన్నా లెజెనోవా మధ్య ప్రేమ పుట్టింది. వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. తరువాత పవన్ తన మాజీ భార్య‌ రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చి 2013 సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నా లెజెనోవా ని పెళ్లి చేసుకున్నారు. ఆ క్షణం నుంచి అన్నా లెజెనోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళ గా మారిపోయారు. వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు పోలేనా అంజనా పవనోవాలు ఉన్నారు.

అన్నా లెజెనోవా మోడ‌ల్, న‌టి అయిన‌ప్ప‌టికీ ఆమె సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటారు. ప్ర‌స్తుతం ఎక్కువ‌గా ర‌ష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అన్నా లెజొనోవా త‌న పిల్ల‌లు ఇద్ద‌రినీ సింగ‌పూర్ లో చ‌దివించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్టు వార్త‌లు వినిపించాయి. అయితే ఎక‌నామిక్ టైమ్స్ ప్ర‌కారం అన్నా లెజెనోవా ఆస్తుల విలువ రూ.1800 కోట్లుగా ఉంది అని స‌మాచారం. ఈ విష‌యం తెలుసుకున్న వారు అవాక్క‌వుతున్నారు. అయితే ఆమెకు ఉన్న ఆస్తులు అన్నీ సింగ‌పూర్‌, ర‌ష్యాల‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now