ఆ యంగ్ హీరో పై ఉన్న ప్రేమను బయటపెట్టిన రొమాంటిక్ బ్యూటీ ?

May 18, 2021 10:52 PM

ఎనర్జిటిక్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ చిత్రంగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే మాస్ యాక్షన్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా నుంచి రామ్, పూరి జగన్నాథ్ ,చార్మి కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే గత ఏడాది రామ్ పుట్టినరోజు సందర్భంగా చార్మి చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి.

పరిస్థితులు చక్కబడ్డాక అందరం కలిసి బాగా పార్టీ చేసుకోవాలని గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా ఛార్మి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 15 పుట్టినరోజు సందర్భంగా ఛార్మి షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ చేసిన కామెంట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

పిచ్చి, వెర్రి.. ప్రతీసారి మైండ్ బ్లాంక్ అవుతూనే ఉంటుందని రామ్‌పై తన ప్రేమను బయట పెట్టారు. కేతికా శర్మ ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణం వల్ల విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ హీరోయిన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now