Radhe Shyam : ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. రాధే శ్యామ్ విడుద‌ల తేదీ ఫిక్స్‌..!

January 31, 2022 2:07 PM

Radhe Shyam : ప్ర‌భాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా న‌టించిన రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సంక్రాంతికి విడుద‌ల కావ‌ల్సి ఉన్న ఈ మూవీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇది ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఎప్ప‌టి నుంచో రాధే శ్యామ్ విడుద‌ల కోసం ఫ్యాన్స్ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌వుతుండ‌డం వారికి అంతులేని ఆనందాన్ని అందిస్తోంది.

Radhe Shyam release date fixed announce by makers
Radhe Shyam

రాధే శ్యామ్ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తామ‌ని, ఓటీటీలో రిలీజ్ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని మేక‌ర్స్ స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీని మార్చి 11, 2022వ తేదీన విడుద‌ల చేస్తామని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం అయినందున ఇక సినిమాను ఆప‌డం ఎంత మాత్రం క‌రెక్ట్ కాద‌ని, క‌నుక ఎట్టి ప‌రిస్థితిలోనూ మార్చి 11న ఈ సినిమాను విడుద‌ల చేయాల్సిందేన‌ని ప్ర‌భాస్ క‌చ్చితంగా చెప్పేశార‌ట‌. అందుక‌ని మేక‌ర్స్ ఆ తేదీని లాక్ చేసేశారు. దీంతో ఆ తేదీన క‌చ్చితంగా మూవీ విడుద‌ల అవుతుంద‌ని తెలుస్తోంది.

కాగా రాధే శ్యామ్ విడుద‌ల తేదీపై ప్ర‌భాస్‌తోపాటు టి-సిరీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు తీవ్రంగా చ‌ర్చించారు. గ‌తంలోనూ ఈ మూవీ విడుద‌ల‌పై అనేక సందేహాలు నెల‌కొన‌గా.. వాటిని మేక‌ర్స్ ప‌టాపంచ‌లు చేసేశారు. ఎట్టేక‌ల‌కు రాధే శ్యామ్ విడుద‌ల అవుతుండ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Radhe Shyam : ఆ తేదీ క‌ల‌సి వ‌స్తుంద‌ని..

ఇక మార్చి 11వ తేదీ స‌మ‌యంలో ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు విడుద‌ల కావ‌డం లేదు. దీంతో ఆ తేదీ క‌ల‌సి వ‌స్తుంద‌ని రాధే శ్యామ్ మేక‌ర్స్ భావిస్తున్నారు. ఢిల్లీలోనూ క‌ర్ఫ్యూను ఎత్తివేశారు. అటు ఏపీలో ఫిబ్ర‌వ‌రి నెల‌లో సినిమా థియేట‌ర్ల టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంది. క‌నుక అన్ని విధాలుగా మార్చిలో సినిమాను విడుద‌ల చేయ‌డ‌మే క‌రెక్ట్ అని రాధే శ్యామ్ మేక‌ర్స్ భావించారు. క‌నుక మార్చి 11 డేట్‌ను సినిమా విడుద‌ల‌కు లాక్ చేసేశారు.

కాగా రాధే శ్యామ్ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజ‌ర్స్‌, పాట‌లు ప్రేక్షకుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో సినిమా హిట్ ప‌క్కా.. అని భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now