Pushpa Movie : బ‌న్నీ కోసం రంగంలోకి దిగ‌బోతున్న ప్ర‌భాస్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

November 30, 2021 1:59 PM

Pushpa Movie : ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోలు స్నేహ భావంతో మెలుగుతున్నారు. ఒక‌రి సినిమాకు మ‌రొక‌రు స‌పోర్ట్ చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. అల్లు అర్జున్ సినిమాకి స‌పోర్ట్ అందిచేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. వివరాల‌లోకి వెళితే.. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప ది రైజ్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా నటిస్తోంది.

Pushpa Movie : బ‌న్నీ కోసం రంగంలోకి దిగ‌బోతున్న ప్ర‌భాస్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మూడో చిత్ర‌మిది. ఫ‌హాద్ ఫాజిల్ మెయిన్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా సునీల్‌, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పుష్ప ది రైజ్ చిత్రం డిసెంబ‌ర్ 17న తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌రిస్తున్నారు.

స‌మంత‌, బ‌న్నీపై సాగుతున్న ఈ పాటతో చిత్రీక‌ర‌ణ ముగియ‌నుంది. ఒక‌వైపు పుష్ప ది రైజ్ నిర్మాణానంతర కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. మ‌రో వైపు ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇండియాలో ప్ర‌ధానమైన న‌గ‌రాల‌కు పుష్ప యూనిట్ వెళ్లి ప్ర‌చారం చేసేలా ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడ‌ట‌. ఇద్ద‌రు హీరోలు ఒకే వేదికపై క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతాయన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment