Chiranjeevi : చిరంజీవి ట్వీట్‌.. సీఎం జ‌గ‌న్ స్పందిస్తారా..?

November 25, 2021 8:17 PM

Chiranjeevi : రీసెంట్‌గా ఏపీ అసెంబ్లీలో సినిమాల‌కి సంబంధించి రోజుకి నాలుగు ఆటలు మాత్రమే.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు.. మిడ్ నైట్ షోలు, బెన్‌ఫిట్ షోలు, స్పెషల్ షోలకు నో పర్మిషన్.. సామాజిక సేవాకార్యక్రమాలకు సంబంధించి నిధుల సేకరణ కోసమైతేనే బెన్‌ఫిట్ షోలకు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుందని ఏపీ ప్ర‌భుత్వం తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.

Chiranjeevi tweet about tollywood will cm ys jagan respond

చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం టికెట్ల రేట్లు ఉండాలంటున్నారు చిరంజీవి. కాలానుగుణంగా.. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా టికెట్ల రేట్లు ఉండాలన్నది.. ఆయన ట్వీట్‌లో కనిపిస్తున్న అంశం.

దేశమంతా ఒకే ట్యాక్స్‌గా జీఎస్టీని ప్రభుత్వాలు వసూలు చేస్తున్నప్పుడు, టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం అంటున్నారు చిరంజీవి. దయచేసి టికెట్ రేట్లపై పునరాలోచించండి.. ప్రోత్సాహం ఉంటేనే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకుంటుందంటూ.. జగన్‌ను ట్యాగ్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. మ‌రి చిరంజీవి ట్వీట్‌పై జ‌గ‌న్ ఏమైనా స్పందిస్తారా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now