Priyanka Chopra : సమంత బాటలోనే ప్రియాంక చోప్రా..? భర్తతో విడిపోనుందా..?

November 23, 2021 10:46 AM

Priyanka Chopra : మాజీ ప్రపంచ సుందరి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఈమె తనకన్నా వయసులో చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి డిసెంబర్ 2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వీరిద్దరూ తమ రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ వీరు తమ మధ్య ఉన్న ప్రేమను వ్యక్త పరిచేవారు.

Priyanka Chopra removed her husband name in social accounts will they take divorce like samantha and naga chaitanya

ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఉన్నఫలంగా అభిమానులకు షాకింగ్ విషయాన్ని బయట పెట్టినట్లు చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు చివర ఉన్న తన భర్త పేరును తొలగించింది. ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా అకౌంట్ లలో ప్రియాంక చోప్రా జోనాస్ అని ఉండగా నవంబర్ 22 వ తేదీన తన పేరు చివరలో ఉన్న
‘చోప్రా జోనాస్’ని తొలగించడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అచ్చం సమంత మాదిరిగానే అక్కినేని పేరును తొలగించినట్టు ఈమె కూడా తన భర్త పేరును తొలగించడంతో ప్రియాంక, నిక్‌ మధ్య మనస్పర్థలు వచ్చాయా..? చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారా.. అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీరి గురించి చర్చ జరుగుతోంది. మరి చోప్రా దంపతులు కూడా సమంత, చైతూలాగే విడాకుల నిర్ణయాన్ని భవిష్యత్తులో ప్రకటిస్తారా.. లేక ఇది సహజమేనా.. అన్న విషయాలు వేచి చూస్తే తెలుస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment