Bigg Boss 5 : జ‌స్వంత్ ఎంత రెమ్యున‌రేషన్ అందుకున్నాడో తెలుసా ?

November 16, 2021 11:35 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెస్టెంట్స్ రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి వారం ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా, ఈ వారం జ‌స్వంత్ ప‌డాల ఎలిమినేట్ అయ్యాడు. నామినేష‌న్‌లో లేక‌పోయినా అనారోగ్యం కార‌ణంగా అత‌డిని ఎలిమినేట్ చేశారు.

Bigg Boss 5 do you know how much remuneration jaswanth alias jessie got

అయితే అత‌నికి వారానికి రూ. 1.50 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పది వారాలకు గాను మొత్తం రూ.10 -15 లక్షల వరకు వెనకేసుకున్నట్లు అంచనా.

ఓ వారం రోజులుగా జస్వంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని హౌస్ నుండి బయటికి పంపడమే ఉత్తమం అని బిగ్ బాస్ భావించారు. జస్వంత్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. అక్క‌డ ప‌లు టెస్ట్‌లు చేయించాడు. పూర్తి వైద్యం తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రం అత‌నికి ఉంద‌ని ఎలిమినేట్ చేసి పంపారు. ఈ క్ర‌మంలో కాజ‌ల్ సేవ్ అయింది.

సీక్రెట్ రూమ్‌లో పెడితే త‌న‌ను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోన‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన జెస్సీకి నిరాశే ఎదురైంది. అయితే జెస్సీ వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల‌కు పలు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాడు.

కాజల్‌ను.. అందరినీ నమ్మకు, నీ ఆట నువ్వు ఆడు.. అంటూ హెచ్చరించాడు. సిరికి ముద్దుల వ‌ర్షం కురిపించాడు. ఇక హౌజ్‌లో పిల్లాడిలా ఉన్న జెస్సీ బయటకు వచ్చాక మిస్టర్‌ మజ్నుగా మారాడు. అరియానాతో తెగ సంద‌డి చేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment