Rashmika Mandanna : రష్మిక మేక‌ప్‌కి ముందు, ఆ త‌ర్వాత‌.. ఈ పిక్ చూస్తే షాక‌వ్వ‌డం ఖాయం.!

November 15, 2021 12:31 PM

Rashmika Mandanna : అల్లు అర్జున్, ర‌ష్మిక ప్రధాన పాత్ర‌లలో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, ర‌ష్మిక‌, అన‌సూయ, సునీల్ ఇలా అంద‌రూ డీ గ్లామ‌ర‌స్ లుక్ లో క‌నిపించ‌నున్నారు. ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. డిసెంబ‌ర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న విష‌యం తెలిసిందే.

Rashmika Mandanna shared a pic of before and after make up

అయితే ముట్టుకుంటే కందిపోయేలా ఉండే రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి ఎంత మేకప్‌ వేశార‌నేది, తాజాగా రష్మిక పోస్ట్ చేసిన ఓ ఫోటో ఈ విషయాన్ని చెబుతోంది. షూటింగ్‌ స్పాట్‌లో తన చేతిని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది రష్మిక. లంచ్‌ సమయంలో చేతులు కడుక్కోగా కేవలం అరచేతి భాగం మాత్రమే మేకప్‌ లేకుండా ఉంది. పై భాగం అంతా మొత్తం మేకప్‌తో నిండిపోయింది. రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి సుకుమార్ ఎంతలా జాగ్రత్త తీసుకున్నాడో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమవుతోంది.

శ్రీ వ‌ల్లి పాత్ర పోషిస్తున్న ర‌ష్మిక లుక్స్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించాయి. ‘ఛలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న‌ అందాల తార రష్మిక మందన్నా.. రెండో చిత్రం ‘గీత గోవిందం’తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరింది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలు, భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పుడు తెలుగే కాదు త‌మిళం, హిందీ భాష‌ల‌లోనూ సినిమాలు చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment