Bhimla Nayak : లాలా భీమ్లా.. మాస్ ఎలిమెంట్స్‌తో అద‌ర‌గొట్టేశాడుగా..!

November 7, 2021 5:29 PM

Bhimla Nayak : వ‌కీల్ సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ కళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఈసినిమాని తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెర‌కెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్బంగా లాలా భీమ్లా అనే పాటను విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు త్రివిక్రమ్ సాహిత్యాన్ని అందించారు.

Bhimla Nayak lala bheemla song fans are very happy

లాలా భీమ్లా అనే పాట‌ను అరుణ్ కౌండిన్య పాడ‌గా.. ఈ పాట‌కు అభిమానుల‌కు పూన‌కాలు వ‌స్తున్నాయి. థమన్ ఏ రేంజ్ లో పవన్ సినిమా భీమ్లా నాయక్ పై ఫోకస్ పెట్టాడో ఈ పాటను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా డాన్సర్స్ తో చేయించిన విజువల్స్ కన్నులకు విందుగా ఉన్నాయి. సినిమాలో పాట ఏ సందర్బంలో వస్తుందో ఊహించుకోవచ్చు. పవన్ పాత్రను హైలైట్ చేయడంలో కచ్చితంగా ఈ పాట కీలకం అవుతుందని అంటున్నారు.

రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్ మూవీగా మార్చేశారు. వకీల్ సాబ్ ను ఎలా అయితే కమర్షియల్ రీమేక్ గా మార్చారో అచ్చు ఈ సినిమాను కూడా హీరో సెంట్రిక్ మూవీగా మార్చేశారు. పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం ఈ సినిమా మరో ప్రత్యేకత అనుకోవచ్చు. రానా స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ న‌టించింది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు, కానీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ కావ‌డం వ‌ల‌న మూవీని ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment