Chiranjeevi : పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన చిరు 154వ చిత్రం.. మాస్ లుక్‌లో కేక పెట్టిస్తున్న మెగాస్టార్..

November 6, 2021 3:48 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌పై ఇప్ప‌టికీ అభిమానుల‌లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీఎంట్రీలో ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచిన చిరు త్వ‌ర‌లో ఆచార్య అంటూ అలరించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, బాబీ సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

Chiranjeevi 154th movie launched

బాబీ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న చిరంజీవి 154వ సినిమా పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ముహూర్త‌పు షాట్‌కి వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాఘవేంద్ర‌రావు, పూరీ జ‌గ‌న్నాథ్, బుచ్చిబాబు, హ‌రీష్ శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇక చిత్రానికి సంబంధించి చిరంజీవి మాస్‌ లుక్ కూడా ఒక‌టి విడుద‌ల చేయ‌గా, ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట్లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ‘మాస్‌ పూనకాలు మొదలాయే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్‌ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

తాజాగా విడుద‌ల చేసిన ఈ పోస్ట‌ర్‌లో ఒకప్పుడు బిగ్ బాస్ తరహాలో మెగాస్టార్ క‌నిపిస్తున్నారు. గ్లాసెస్, స్టైల్ గా సిగరెట్ వెలిగించడం, మెడలో ఆ గొలుసు.. ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కి పూర్వ వైభవం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ బడా ప్రాజెక్ట్ పై ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment