Pushpa Movie : పుష్ప మూవీ హిందీలో రిలీజ్‌ లేనట్లే..? గట్టి దెబ్బే పడిందిగా..?

November 6, 2021 1:39 PM

Pushpa Movie : టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోంది. ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 17న ఖరారైన విషయం తెలిసిందే. అందుకే హీరో అల్లు అర్జున్‌ తన సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న అల్లు అర్జున్ కి షాక్ తగిలింది. పుష్ప సినిమా బహుశ హిందీ మార్కెట్ లో రిలీజ్ కాకపోవచ్చని అంటున్నారు సినీ నిర్మాతలు.

Pushpa Movie may not be released in hindi

పుష్ప సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారు. మొదట ఫస్ట్ పార్ట్ ని నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తుంది ఫిల్మ్ టీమ్. ఈ క్రమంలో ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఫిల్మ్ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని అనుకోకముందే హిందీ డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేశారట. అందుకే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సదరు డిస్ట్రిబ్యూటర్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మేకర్స్ కి, హిందీ డిస్ట్రిబ్యూటర్ కు జరిగిన చర్చలు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, పుష్ప సినిమా హిందీ మార్కెట్ లో రిలీజ్ కాకపోవచ్చని అంటున్నారు. ఇదే కనుక జరిగితే పుష్ప సినిమాని పాన్ ఇండియా సినిమా లిస్ట్ లో చేర్చరు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ ని ఒప్పించేందుకు కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారట.

ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ ను 1000 మందికి పైగా డాన్సర్లతో షూట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మరి ఇన్ని హంగులతో తెరకెక్కుతున్న సినిమా హిందీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో లేదో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment