Chiranjeevi : మెగాస్టార్ 154 అప్‌డేట్ వ‌చ్చింది.. ఇక అభిమానుల‌కి పూన‌కాలే..!

November 4, 2021 5:50 PM

Chiranjeevi : కుర్ర హీరోల‌తో పోటీప‌డుతూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా: నరసింహా రెడ్డి’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో కలిసి బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాను పూర్తి చేశారు. ఫిబ్ర‌వ‌రి 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Chiranjeevi 154 movie update came

ఇక మ‌లయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ను ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లైంది. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన ‘వేదాళం’ చిత్రాన్ని ‘భోళా శంకర్’గా తెలుగులోకి రీమేక్ అనువాదం చేస్తున్నారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేయనుండ‌గా, దానికి సంబంధించి అఫీషియల్ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

బాబీ-చిరంజీవి కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న చిత్రం న‌వంబ‌ర్ 6న ఉద‌యం 11.43 పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది. 12.03 ని.ల‌కు చిరంజీవి మాస్ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అది చూసి అభిమానుల‌కి పూన‌కాలే అంటున్నారు. ఇందులో క‌థానాయిక‌గా సోనాక్షి సిన్హాని తీసుకోబోతున్న‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment