Chiranjeevi : మెగాస్టార్ తో నటించనున్న ఐకాన్ స్టార్..?

October 29, 2021 3:24 PM

Chiranjeevi : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాల హవా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్, మెగాస్టార్ నటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మరొక మల్టీస్టారర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Chiranjeevi may act with allu arjun

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా విడుదల కావాల్సి ఉండగా చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక బాబీ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా మెగాస్టార్ కి శ్రీకాంత్ అడ్డాల కథను వినిపించగా అందుకు మెగాస్టార్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్క్రిప్టు మొత్తం సిద్ధం చేయాల్సిందిగా మెగాస్టార్ సూచించినట్లు తెలుస్తోంది.

ఇక శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఈ కథలో మరో కీలక పాత్ర ఉందని అందులో నటించడానికి అల్లు అర్జున్ కరెక్ట్ గా సరిపోతారని శ్రీకాంత్ అడ్డాల సూచించినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఇదివరకే మెగాస్టార్ అల్లు అర్జున్ కలిసి డాడీ, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో కనిపించారు. మరి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment