Adipurush : చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ ఆదిపురుష్..!

October 28, 2021 2:37 PM

Adipurush : బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 70 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం.

Adipurush came to final stage of filming

నవంబర్ నెల ఆఖరులోగా ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఆ తరువాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.  వీఎఫ్ఎక్స్ వాడటం వల్ల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే ఎక్కువ సమయం తీసుకుండడం వల్ల ఈ చిత్రాన్ని నవంబర్ లోగా పూర్తి చేయాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment