Chiranjeevi : దీపావళి సందర్భంగా సెట్స్ పైకి చిరు కొత్త సినిమా..!

October 22, 2021 3:36 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుని నేటి తరం యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో మాత్రమే కాకుండా చిరు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలిసిందే.

Chiranjeevi new movie to start from diwali

ఈ క్రమంలోనే చిరంజీవి మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. అయితే వీటిలో ముందుగా బాబీ దర్శకత్వంలోనే సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

పవర్ ఫుల్ మసాలా కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను 6వ తేదీ నుంచి షూటింగ్ పనులు ప్రారంభించడం కోసం చిత్రబృందం ఏర్పాట్లను పూర్తి చేసింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ విడుదల చేసి ఇప్పటికే ఇదే విషయాన్ని తెలియజేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment