Pawan Kalyan : ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు మానేస్తున్నారా..!

October 20, 2021 1:35 PM

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉన్న‌క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా విడుద‌లైంది అంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క వ‌ర్షం కురుస్తూ ఉంటుంది. ఇటీవ‌ల రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య‌లో కొన్నాళ్లు సినిమాలు చేయ‌డం మానేశారు. అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూర‌మైన ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు భీమ్లానాయ‌క్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాల షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నారు.

Pawan Kalyan may give break to movies for some time to be active in politics

ఈ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాతోపాటు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సింది ఉంది. మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రింత బలోపేతం చేసేందుకు గాను సినిమాల‌కు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వాల‌ని అనుకుంటున్నారట‌.

త‌న నివాసాన్ని హైద‌రాబాద్ నుంచి విజ‌యవాడ‌కు మార్చాల‌ని అనుకుంటున్నారట‌. అంటే ఎక్కువ స‌మ‌యం అక్క‌డ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌నేది ప‌వ‌న్ నిర్ణ‌యం. అయితే సినిమా షూటింగ్స్ ఎక్కువ‌గా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతూ ఉంటాయి. విజ‌య‌వాడ‌లో ఉండ‌నున్న ప‌వ‌న్ ప్ర‌తి సారిహైద‌రాబాద్‌కి రావ‌డం క‌ష్టం కాబ‌ట్టి, కొద్ది రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నారట‌. గ‌తంలో స్పైస్ జెట్‌లోఅక్క‌డి నుండి ఇక్క‌డికి తిరిగిన ప‌వ‌న్ ఇప్పుడు మాత్రం అలా చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు. నిర్మాత‌ల‌కు మ‌రింత ఆర్థిక భారాన్ని పెంచే ఆలోచ‌న లేని ప‌వ‌న్ కొద్ది రోజుల పాటు సినిమాల‌కు దూరం కానున్నారట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment