Tollywood : టాలీవుడ్ టాప్ యాంకర్ల భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా ?

October 18, 2021 10:54 PM

Tollywood : బుల్లితెర ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంటర్ టైన్ చేసే అందమైన యాంకర్ల భర్తల గురించి చాలా రేర్ గా చెబుతుంటారు. వారికి పెళ్ళైన విషయం కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. అటు బుల్లితెరపై.. వెండితెరమీద తమ అభినయంతో అలరిస్తూ.. ఎంతోమంది ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న యాంకర్ల భర్తల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

Tollywood anchors and their husbands interesting things

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం టాప్ యాంకర్స్ లో ఒకరైన అనసూయ భరద్వాజ్ కు ఇద్దరు పిల్లలున్నారు. తన అందం, అభినయంతో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. ఆయన ఒక బిజినెస్ మన్.

నెక్ట్స్ తన చిలిపి అల్లరితో బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వించి మెప్పించిన యాంకర్ లాస్య తెలుగువారికి ఎంతో ఇష్టం. ఆమె భర్త మంజునాథ్. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కొన్నాళ్ళు విదేశాల్లో ఉన్నాక.. గత సీజన్ లో బిగ్ బాస్ లో రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది. ఓ యూట్యూబ్ ఛానల్ లో కూడా తన ఐడియాస్ ని షేర్ చేసుకుంటూ ఎంటర్ టైన్ చేయడంలో మళ్ళీ బిజీగా మారింది.

టెలివిజన్ ప్రేక్షకుల్ని తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చేసే యాంకర్లలో సుమ కనకాల టాప్ పొజిషన్ లో ఉంటుంది. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేస్తూ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత ఉదయభాను భర్త విజయ్. ఈయన బిల్డర్ గా వర్క్ చేస్తున్నారు. ఆమె పెళ్ళి తర్వాత మళ్ళీ టెలివిజన్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా.. అంతగా సక్సెస్ కాలేదు.

ఝాన్సీ భర్త జోగినాయుడు కూడా నటుడిగా సుపరిచితులే. యాంకర్ గాయత్రీ భార్గవ్ భర్త విక్రమ్ ఆర్మీ అధికారిగా ఉన్నారు. యాంకర్ శిల్పా చక్రవర్తి భర్త పేరు కళ్యాణ్ చక్రవర్తి. సమీరా భర్త అన్వర్ కూడా సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment