Chiranjeevi : చిరంజీవి అభిమానుల‌కు పండుగే.. ఆచార్య రిలీజ్ డేట్ చెప్పేశారు..!

October 9, 2021 10:56 PM

Chiranjeevi : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య అనే మూవీని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్య ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీని ఈ ఏడాది మే 13న విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా కుద‌ర‌లేదు.

Chiranjeevi acharya movie release date announced

అయితే కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ ఈ మూవీని మ‌ళ్లీ ద‌స‌రాకు విడుద‌ల చేస్తార‌ని భావించారు. త‌రువాత సంక్రాంతి వ‌ర‌కు రిలీజ్ ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ అది కూడా వాయిదా ప‌డింది. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయ‌నున్నారు. ఈ మేర‌కు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగాస్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపుగా 30 నిమిషాల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ పాత్రే సినిమాకు హైలైట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ మూవీలో ఒక ప్ర‌త్యేక పాట‌లో రెజీనా న‌టించింద‌ని తెలిసింది. అలాగే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీతోపాటు చిరంజీవి మరో రెండు సినిమాల‌లో న‌టిస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాద‌ర్ పేరిట‌ రీమేక్ చేస్తుండ‌గా.. తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ లోనూ న‌టిస్తున్నారు. ఏది ఏమైనా తాజా ప్ర‌క‌ట‌న మాత్రం అభిమానుల‌కు ఆనందాన్నిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment