ప్రియురాలితో క‌లిసి హోట‌ల్‌కు వెళ్లిన భ‌ర్త‌.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న భార్య‌.. వీడియో..!

August 16, 2021 10:27 PM

భార్య‌కు తెలియ‌కుండా భ‌ర్త‌, భ‌ర్త‌కు తెలియకుండా భార్య‌.. ఇలా కొంద‌రు వేరే వారితో ప్రేమాయ‌ణం న‌డుపుతుంటారు. ఎవ‌రికీ తెలియ‌కుండా ఉన్నంత వ‌ర‌కు ఓకే. కానీ అనుమానం వ‌చ్చినా, త‌మ జీవిత భాగ‌స్వామికి ఇంకొక‌రితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని తెలిసినా.. ఆ దంపతుల జీవితం నాశ‌నం అవుతుంది. ఈ క్ర‌మంలోనే కొన్ని సంద‌ర్భాల్లో త‌మ లైఫ్ పార్ట్ న‌ర్స్ వేరే వారితో ఉండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంటుంటారు. మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్‌లోనూ తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

ప్రియురాలితో క‌లిసి హోట‌ల్‌కు వెళ్లిన భ‌ర్త‌.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న భార్య‌.. వీడియో..!

ఓ వ్య‌క్తి త‌న ప్రియురాలిని కారులో కూర్చోబెట్టుకుని ఓ హోట‌ల్‌కు వ‌చ్చాడు. అయితే అత‌నిపై ముందు నుంచీ అనుమానంగానే ఉన్న అత‌ని భార్య హోట‌ల్ వ‌ర‌కు అత‌న్ని ఫాలో అయింది. కారులోంచి అత‌ను దిగ‌గానే ఒక్క‌సారిగా అత‌ని భార్య ప‌రిగెత్తుకుని వ‌చ్చి అత‌నిపై దాడికి దిగింది.

https://www.instagram.com/p/CSgffQ4FgpV/?utm_source=ig_embed&ig_rid=099e9881-3249-4f7a-9ade-b6ceff6f8a1f

కారులో కూర్చున్న అత‌ని ప్రియురాలిని బ‌య‌ట‌కు లాగింది. ఇద్ద‌రిపై ఆమె దాడి చేసింది. ఈమె ఎవ‌రు ? అని ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను అడుగుతుండ‌డాన్ని కూడా విన‌వ‌చ్చు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే త‌రువాత ఏమైంద‌న్న విష‌యం తెలియ‌దు కానీ.. భ‌ర్త‌ను అలా రెడ్ హ్యాండెడ్‌గా ఇంకో మ‌హిళ‌తో ప‌ట్టుకున్నందుకు ఆమెను అంద‌రూ అభినందిస్తున్నారు. స‌రైన ప‌నిచేశామ‌ని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చాలా మంది ఇప్పటికే వీక్షించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment